వైద్య రంగంలో హెపటైటస్-సి వైరస్‌పై పరిశోధనలకు ముగ్గురికి నోబెల్..

By Srinivas Racharla Oct. 05, 2020, 06:49 pm IST
వైద్య రంగంలో హెపటైటస్-సి వైరస్‌పై పరిశోధనలకు ముగ్గురికి నోబెల్..

ప్రతి ఏటా అక్టోబర్ మొదటివారంలో ప్రకటించే ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల పరంపర ప్రారంభమైంది. 2020 సంవత్సరానికి వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ఇద్దరు అమెరికన్‌ సైంటిస్టులు, ఒక బ్రిటీష్‌ శాస్త్రవేత్తకు సంయుక్తంగా ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది.హెపటైటిస్‌ సీ’ వైరస్‌ గుర్తింపులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు హార్వే జే. ఆల్టర్‌, మైఖేల్ హటన్,ఛార్లెస్‌ ఎం. రైస్‌లను ఈ పురస్కారానికి నోబెల్‌ కమిటీ ఎంపిక చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో హెపటైటిస్‌ ఒకటి. దీని వల్ల ఎంతో మంది కాలేయ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. హెపటైటిస్‌లో A,B వైరస్‌ రకాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ వ్యాధి సంక్రమణకు సరైన కారణాలు ఇప్పటివరకు గుర్తించ లేకున్నారు.కాగా హెపటైటిస్‌ వైరస్‌లపై హార్వే, మైఖేల్‌, ఛార్లెస్‌ పరిశోధనలు చేసి ‘హెపటైటిస్‌ సి’ వైరస్‌ను గుర్తించారు. వీరి పరిశోధనల వల్ల హెపటైటిస్‌కు మందు కనుగొనడం మరింత సులభతరం కానున్నది.

ఇక ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం ఆయన మరణించిన ఐదేళ్ల తర్వాత 1901లో ఆయన పేరు మీదుగా ప్రతిష్ఠాత్మక నోబుల్ పురస్కారాలను ప్రారంభించారు. తొలినాళ్లలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, ప్రపంచ శాంతికి కృషి చేసిన వ్యక్తులకు నోబెల్ బహుమతులను బహుకరించేవారు. అయితే 1969 నుంచి అర్ధశాస్త్రంలోను నోబుల్ బహుమతిని ప్రవేశపెట్టారు. నోబుల్ శాంతి బహుమతి తప్ప మిగతా 5 పురస్కారాలను ఆయన వర్ధంతి రోజైన డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ప్రధానం చేస్తారు.కాగా ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతిని మాత్రం బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అందజేస్తోంది.

వైద్య రంగంలోను ఆసక్తి గల అల్ఫ్రెడ్ నోబెల్ కరోలినిస్కా ఇన్‌స్టిట్యూట్‌లో స్వీడన్ వైద్యుడు జోన్స్ జోహన్స్‌తో కలిసి పరిశోధనలు చేశారు.అందుకే వైద్య శాస్త్రంలోను నోబెల్‌ బహుమతిని స్వీడన్‌కు చెందిన కరోలిస్కా ఇన్‌స్టిట్యూట్ అందజేస్తుంది.ఇప్పటివరకు వైద్యరంగంలో ఈ పురస్కారాన్ని అందుకున్న భారతీయ శాస్త్రవేత్త హరగోవింద్ ఖురోనా(1968) ఒక్కడే. వంశపారంపర్యంగా సంక్రమించే జీవనిర్మాణానికి దోహదం చేసే 'కృతిమ జీన్' ను సృష్టించారు.అలాగే డీఎన్ఏ ముక్కలను అతికించు 'డిఎన్ఏ లిగసె' అనబడుఎంజైమును కనుగొన్నారు. ఈ పరిశోధనల మూలముగా 1968లో వైద్యరంగంలో ఖోరానాకు నోబెల్ పురస్కారం లభించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp