No friends for CBN -ప్రజలు పట్టించుకోలేదు సరే ..... మిత్రులూ ముఖం చాటేశారా ?

By Voleti Divakar Oct. 23, 2021, 08:30 am IST
No friends for CBN -ప్రజలు పట్టించుకోలేదు సరే ..... మిత్రులూ ముఖం చాటేశారా ?

' రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది . ఏపి గంజాయికి అడ్డాగా మారిపోయింది . ' అని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నెత్తీనోరు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు . టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటి పైనా ... అమరావతిలోని టిడిపి కార్యాలయంపైనా దాడులు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాటం పేరిట చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు .

మంగళవారం దాడి జరగ్గా , బుధవారం రాష్ట్ర బంద్ కు  పిలుపునిచ్చారు . కొమ్మారెడ్డి పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన వైసిపి కార్యకర్తలు , జగన్ అభిమానులు పట్టాభి ఇంటిపై , టిడిపి కార్యాలయంపై దాడులు చేశారు . దాడులకు నిరసనగా చంద్రబాబు బంద్ కు పిలుపునిచ్చి , స్వయంగా నిరసన దీక్షకు దిగారు . చంద్రబాబు ఇచ్చిన బంద్ పిలుపును రాష్ట్రవ్యాప్తంగా వర్తకులు , ప్రజలు పట్టించుకోలేదు . దీంతో బంద్ విఫలమైంది .

ఆయన నిరసన దీక్షకైనా ప్రజల నుంచి కాకపోయినా కనీసం మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్ , సిపిఐ , జనసేన పార్టీల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు . కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహా జనసేన , సిపిఐ , కాంగ్రెస్ పార్టీలు ఖండనలకి మాత్రమే పరిమితమయ్యాయి . జనసేన అధినేత పవన్ కళ్యాణ్,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె . రామకృష్ణ టిడిపి కార్యాలయంపై దాడిని ఖండించారు . అయితే చంద్రబాబు నిరసన దీక్షకు మిత్రపక్షాలేవీ సంఘీభావం ప్రకటించకపోవడం గమనార్హం . ఆయా పార్టీల నేతలను నిరసన దీక్షాస్థలి వద్దకు రప్పించేందుకు టిడిపి నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు కనిపిస్తున్నాయి .

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న టిడిపి అధినేత డిమాండ్ కు కూడా మిత్రపక్షాల నుంచి మద్దతు కరువైంది . దీంతో బాబు దీక్షను పచ్చమీడియాలో హైలెట్ చేసేందుకు సొంత కార్యకర్తలనే తరలించుకోవాల్సి వచ్చింది . చంద్రబాబునాయుడు ఆందోళన చెందినట్లు రాష్ట్రం ఇంతలా నాశనం అవుతున్నా ఆ పార్టీలు పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబు వాదనలు , ఆందోళనల్లో పసలేదన్న విషయం స్పష్టమవుతోంది. మొన్నటి వరకు బాబు బాటలో నడిచిన మిత్రపక్షాలు ఇప్పుడు ఆయన దీక్షకు ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

Also Read : Sajjala Request - బోసిడీకే అంటే బాగున్నారా..? అని అర్థమా..? ఢిల్లీ నేతలను ఇదే పదంతో సంబోధించండి బాబు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp