నెగ్గిన అవిశ్వాస తీర్మానం – సుంకర పావని ఇక మాజీ మేయర్‌

By Balu Chaganti Oct. 05, 2021, 01:00 pm IST
నెగ్గిన అవిశ్వాస తీర్మానం –  సుంకర పావని ఇక మాజీ మేయర్‌

చాలా కాలం నుంచి హాట్ టాపిక్ గా మారిన కాకినాడ టీడీపీ మేయర్ పావని అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ గా ఎన్నికైన సుంకర పావని మీద వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.. ఈ అవిశ్వాస తీర్మానంలో మేయర్ కు వ్యతిరేకంగా 36 ఓట్లు వచ్చాయి.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టిడిపి కార్పొరేటర్లు 21 మంది మేయర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయడమే కాక మరో 9 మంది టీడీపీ కార్పొరేటర్ లు తటస్థంగా వ్యవహరించడం. వారు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా తమ అంగీకారం తెలపలేదు. నిజానికి టీడీపీ కార్పొరేటర్లు అందరికీ విప్ జారీ చేసినా సరే విప్ ధిక్కరించి మరీ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటింగ్ కు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇక ఈ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో సుంకర పావని మేయర్ పదవి నుంచి దిగిపోయాక వలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని మాత్రం రిజర్వులో ఉంచినట్లుగా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఎందుకంటే కోర్టు తీర్పు నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని రిజర్వులో ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొత్త మేయర్ ఎవరనేది ప్రకటించవద్దని ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ విషయాన్ని కూడా వాయిదా వేశారు.

Also Read : భవిష్యత్తు లో ఎమ్మెల్యే సీట్ అని ఆశపడి ఉన్న మేయర్ సీట్ పొగొట్టుకున్న వైనం...

నిజానికి 2017 లో కాకినాడ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగగా మెజారిటీ డివిజన్లను తెలుగుదేశం కైవసం చేసుకుంది. మొత్తం 48 డివిజన్లలో 30 మంది కార్పొరేటర్లు తెలుగుదేశానికి ఉన్నారు.. వైసీపీకి పది మంది. బీజేపీకి ముగ్గురు ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. ఇండిపెండెంట్ లలో ఒకరు గతంలోనే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే వీరిలో ముగ్గురు మరణించగా ఒకరు రాజీనామా చేశారు. అలా 44 మందికి గాను టీడీపీ -30, వైసీపీ-8, బీజేపీ-3, స్వతంత్రులు 3 ఉన్నారు. టీడీపీ సభ్యులు 21 మంది, ఇద్దరు బీజేపీ సభ్యులు అసమ్మతి వర్గంలో ఉండడంతో పాటు వైకాపా, స్వతంత్రులు కలిపి మొత్తం 33 మంది కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాసంకు మద్దతు ఇవ్వగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కూడా కలుపుకుని 36 వోట్లు మేయర్ కు వ్యతిరేకంగా వచ్చాయి.

గత కొద్ది రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి ఉన్న 30 మంది కార్పొరేటర్ల లో 21 మంది మేయర్ మీద అసమ్మతి గళం వినిపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ అసమ్మతి వర్గం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా సరే ఏ మాత్రం అసమ్మతి తగ్గని పరిస్థితులు నెలకొన్నాయి. నగరపాలక సంస్థ చట్ట ప్రకారం ప్రకారం నాలుగేళ్ల పదవి కాలం తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమంది టీడీపీ కార్పొరేటర్లు వైసీపీలోకి వచ్చి చేరారు కానీ చట్ట ప్రకారం నాలుగేళ్లు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోవడంతో మేయర్ సుంకర పావని పదవికి ఇబ్బంది రాలేదు. ఇక నాలుగేళ్ళు పూర్తి కావడం ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆమె దిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి తర్వాత మేయర్ గా ఎవరు ఎన్నికవనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : జనసేనకి ఉన్నది కూడా పోయింది..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp