దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించిన నిర్భయ తల్లి

By Surya.K.R Dec. 06, 2019, 10:01 am IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్  పై స్పందించిన నిర్భయ తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన దిశ ఘటనలో నలుగురు నిందితులని ఈ తెల్లవారుజామున పొలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ సందర్భంగా ఎన్ కౌంటర్ చేశారు. దీంతో తెలంగాణ పొలీసులు తీసుకున్నఈ నిర్ణయంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటన పై 2012లో సంచలనం రేపిన డిల్లీ అత్యచార భాదితురాలు నిర్భయ తల్లి ఆశదేవి స్పందిస్తూ తన కూతురుని పోట్టన పెట్టుకుని 7ఏళ్ళు గడుస్తున్నాఇంతవరకు న్యాయం జరగలేదని, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. నిర్భయ జరిగి 7 ఏళ్ళు అవుతోంది. దిశకు 8 రోజుల్లోనే న్యాయం చేశారు. కానీ నా కూతురు కు ఇంకా న్యాయం చేయలేదని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

‘దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారు. కానీ నా బిడ్డ చనిపోయి ఏడేళ్లు అవుతోంది. అయినా కనీస న్యాయం జరగలేదు. ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఉరిశిక్ష పడింది కానీ అది ఇంత వరకు అమలు కాలేదు. శిక్ష అమలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. దిశ కేసులో పోలీసుల తీరును స్వాగతిస్తున్నా. ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవద్దు. ఆమె ఆత్మకు ఎట్టకేలకు శాంతి జరిగింది’ అని అన్నారు. ఉజ్వలభవిష్యత్తు ఉన్న దిశాను నాశనం చేసిన వారిని పోలీసులు ఎన్ కౌంటర్ తో తగిన సమాధానం చెప్పారన్నారు. ఎక్కడ ఎవరు ఇలాంటి దాడులకి పాల్పడినా ఇలాగే కఠినంగా అనిచివేయాలని, అప్పుడే ఇదోక హెచ్చరికలా మారి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని సూచించారు.

దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 15న నిర్భయపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించగా.. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరొక నిందితున్ని మైనర్ అనే కారణంతో జువెనైల్ హోమ్ కు తరలించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp