నిర్భయ దోషుల జైలు వేతనం రూ.1.37 లక్షలు

By Nehru.T Jan. 18, 2020, 09:16 am IST
నిర్భయ దోషుల జైలు వేతనం రూ.1.37 లక్షలు

ఏడేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు ఈనెల 22న ఉరి తీయనుండగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ను జైలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. జైల్లో వారి ప్రవర్తన, తోటివారితో మెలిగిన తీరు, జైల్లో వారు చేసిన పనికి సంబంధించిన వేతనాలను లెక్కగడుతున్నారు.

ఈ నేపథ్యంలో నలుగురు దోషుల్లో ముగ్గురు శారీరక శ్రమ చేసేందుకు అంగీకరించగా ఒకరు మాత్రం తాను ఏ పనీ చేయనని చెప్పేసారు. దీంతో మిగతా ముగ్గురు గత ఏడేళ్లలో జైల్లో కాయకష్టం చేసి మొత్తం.ర రూ.1.37 లక్షలు ఆర్జించారు. ఈ డబ్బును వారి కుటుంబీయులకు తీహార్. జైలు అధికారులు అందజేస్తారు.

ఏ కేసులో దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు తిహార్ జైల్లో ఉన్నపుడు చేసిన పనికి పొందిన వేతనాల డబ్బును జైలు అధికారులు లెక్క వేశారు. ముకేశ్ సింగ్ జైల్లో అందరికంటే అత్యధికంగా రూ.69వేలు సంపాదించారు. మరో దోషి వినయ్ శర్మ రూ.39వేలు, పవన్ గుప్తా రూ.29వేలు సంపాదించారు. మరో దోషి అక్షయ్‌ కుమార్ జైలులో కూలీగా పనిచేసేందుకు నిరాకరించాడు. దీంతో అతనికి జైల్లో ఎలాంటి వేతనం దక్కలేదు. 

ఉరి తీయనున్న నేపథ్యంలో నలుగురు దోషులకు పెట్టే భోజనాన్ని తగ్గించారు. జైల్లో దుష్ప్రవర్తన కారణంగా వినయ్ శర్మకు జైలు అధికారులు 11 సార్లు శిక్షించారు.పవన్‌గుప్తాకు 8 సార్లు, అక్షయ్‌ కుమార్ కు 3 సార్లు, ముకేశ్‌ సింగ్‌ కు ఒకసారి జైలు అధికారులు చిన్న చిన్న శిక్షలు వేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp