అంతర్జాతీయ క్రీడాకారిణి రక్తాక్షర లేఖ

By Kotireddy Palukuri Dec. 15, 2019, 05:27 pm IST
అంతర్జాతీయ క్రీడాకారిణి రక్తాక్షర లేఖ

నిర్భయ కేసులో శిక్షను అనుభవిస్తున్న దోషులను తన చేతులతో ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ అంతర్జాతీయ షూటర్‌ వర్తిక సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. 2012 డిసెంబర్‌ 16న అతి కిరాతకరంగా అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన దోషులు ప్రస్తుతం తీహార్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. త్వరలోనే వీరిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు వారిని ఉరి తీసే అవకాశం కల్పించాలని కోరుతూ వర్తిక సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రక్తంతో లేఖను రాశారు.

'ఇది నా రక్తంతో రాస్తున్నా! నిర్భయ హత్య కేసు దోషులను నా చేతులతో ఉరి తీసే అవకాశం కల్పించండి. దీనిద్వారా దేశంలో ఒక మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదనే సందేశాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నా" అని వర్తిక సింగ్ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు అనంతరం నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ఈ కేసులో దోషి దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 17న సుప్రీం విచారించనుంది. మరో వైపు తన బిడ్డపై అఘాయిత్యం చేసిన రోజు డిసెంబర్ 16నే దోషులను ఉరి తీయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp