తొమ్మిది లక్షల కోట్లు ఎగ్గొట్టారు!

By Mavuri S Feb. 26, 2021, 10:00 pm IST
తొమ్మిది లక్షల కోట్లు ఎగ్గొట్టారు!

9 లక్షల కోట్లు. ఎన్ని సున్నాలుంటాయో వెంటనే చెప్పడం కూడా కష్టం. కొన్ని రాష్ట్రాలకు ఏడాది బడ్జెట్. ఇంత భారీ మొత్తం సొమ్మును మన బ్యాంకు లు ఊరికే వదిలేసాయి అంటే నమ్మక తప్పదు. అవునండీ గత పదేళ్ళలో దేశీయ బ్యాంకులు మొత్తం 9 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసినట్లు ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది.

అంతా కార్పొరేట్ మాయ!

సామాన్యుడికి అత్యవసరమైన రుణం కావాలంటే సవాలక్ష కాగితాలు, ఎన్నో షూరిటీ లు అడిగే బ్యాంకులు కార్పొరేట్ సంస్థలు అడిగిన వెంటనే పిలిచి మరి రుణాలు ఇస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో తనిఖీ చేయక, కమీషన్లకు కక్కుర్తిపడి కోట్లకు కోట్లు రుణాలను వేగంగా ఇస్తూ, తర్వాత అవి వసూలు కాక తర్వాత అవి వసులు కాక రద్దు ఖాతాలో వేస్తున్నాయి. గత పదేళ్ళకాలంలో దేశియ బ్యాంకు లు 8,83,168 కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు స్వయనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 76 శాతం ఉండడం విశేషం. రద్దు చేసిన వాటిలో 90% పైగా కార్పొరేట్ రుణాలే కావడం గమనించాల్సిన అంశం.

ప్రభుత్వ బ్యాంకులే అధికంగా..

రుణాలను రద్దు చేసిన వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా ఎక్కువగా ఉంది. 2010 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు 6,67,345 కోట్ల రుణాలను రద్దు చేయగా, ప్రైవేట్ బ్యాంకులు 1,93,033 కోట్లు, విదేశీ బ్యాంకులు 22,790 కోట్ల రుణాన్ని వసూలు చేయలేక రద్దు చేశాయి. కార్పొరేట్ రుణాలు వసూలు కాక బ్యాంకులు నష్టపో లేక ఆ భారాన్నంతా వినియోగదారుడికి వివిధ రూపాల్లో బ్యాంకులు వడ్డీస్తున్నాయి. రకరకాల చార్జీలతో వినియోగదారులకు సేవ చేయాల్సిన బ్యాంకులు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. బ్యాంకు లో కనీస అమౌంట్ లేకున్నా సరే ఫైన్ వేసే సంస్కృతి ఈ రద్దుల నష్టాలు తర్వాత వచ్చినదే.

గతేడాది 2.37. లక్షల కోట్లు!

2010 నుంచి తొమ్మిదేళ్లలో 6.40 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన బ్యాంకులు 2019 2020 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 2.37 లక్షల కోట్ల రుణాన్ని రైట్ ఆఫ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇది మొత్తం రద్దులో 40 శాతం వాటగా తెలుస్తోంది. దీనిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 1.78 లక్షల కోట్లు, ప్రైవేటు బ్యాంకులు 53 వేల కోట్లు ఉన్నాయి. మొత్తం దేశీయంగా బ్యాంకుల మొత్తం విలువ 92.60 లక్షల కోట్లు అయితే దీనిలో రుణాల రద్దు వాట 2.56 శాతం పెరిగింది. 1980లో ఇది కేవలం 0.23 శాతం అయితే గణనీయంగా పెరగడం గుర్తించవచ్చు.

ఎందుకు రైట్ ఆఫ్ చేస్తాయి??

ఒక కంపెనీ కు ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఒకేసారి మూత పడటమో లేక మరో ఇబ్బంది కలిగో రుణం మొత్తం ఇచ్చే పరిస్థితి లేనపుడు అన్నీ రకాలుగా బ్యాంకు దారులు వెతికి ఇక ఇచ్చిన అప్పు రాదు అని నిర్ధారించుకున్న తర్వాత రైట్ ఆఫ్ లోకి దీనిని తీసుకువెళ్తాయి. దీనికి ఎవరూ బాధ్యత వహించరు. 2020 లో కరోనా ప్రభావంతో చాలా కార్పొరేట్ కంపెనీ లు దారుణంగా నష్ట పోయాయాని, దీని వల్లనే రుణాలు వసులు కాలేదు అన్నది బ్యాంకు ల మాట. అయితే కేవలం కార్పొరేట్ కంపెనీ లకు ఇంత మొత్తం లో రిలీఫ్ ఇచ్చిన బ్యాంకులు సామాన్యుడి నెలవారీ వాయిదా చెల్లింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం మీద పోరాటానికి దిగటం అందరికీ గుర్తే.

ఎస్ బీ ఐ అధికంగా...

బ్యాంకు ల స్థుల నిరర్ధక ఆస్తుల విలువ తగ్గినప్పటికి ఒకేసారి లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేయడం వల్ల బ్యాంకుల ఆర్థిక స్థితిగతుల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకుల అంతా చేసేది రొటేషన్ వ్యాపారమే. వచ్చే కమిషన్ మాత్రమే వాటికీ లాభం. మధ్యవర్తిగా వ్యవహరించే బ్యాంకుల వద్ద సరైన సమయంలో నగదు లభ్యత లేకపోతే అది కొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అనేది రిజర్వుబ్యాంకు మాట. ఇప్పుడు ఈ విషయం ఆ బ్యాంకులు ఆర్థిక స్థితిగతులు లాభాల పైన తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుంది. బ్యాంకులు రద్దు చేసిన రుణాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 56 వేల 362 కోట్ల రుణాన్ని రద్దు చేస్తే, దాని తరువాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1640 6 కోట్లను రద్దు చేసింది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ 8,254 కోట్ల రుణాలను మాత్రమే రద్దు చేసి ఈ లిస్టులో చివరి వరుసలో నిలిచింది. ప్రతి బ్యాంకు కొన్ని మొండి బకాయిలు ఉండటం సహజమే కానీ, గత దశాబ్ద కాలంగా బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పులతో కార్పొరేట్ మొండి బకాయిలు ఎక్కువవుతున్నాయి. దీనిపై బ్యాంకులు సీరియస్గా దృష్టి పెట్టక పోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp