మహిళలపై వేధింపుల నిరోధానికి కొత్త చట్టం

By Kiran.G Dec. 09, 2019, 04:37 pm IST
మహిళలపై వేధింపుల నిరోధానికి కొత్త చట్టం

మహిళలపై దాడులు వేధింపులకు గురి చేస్తే శిక్షలు కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల సంరక్షణ కోసం కొత్త చట్టాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పిల్లలపై మహిళలపై అత్యాచారాలు,వేధింపులకు గురిచేస్తే, వదిలిపెట్టబోమని స్పష్టం చేసారు. కొత్త చట్టాన్ని మరో రెండురోజుల్లో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.తనకు ఒక భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

ఏదైనా నేరం జరిగితే వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్‌, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ రేటు పెరగటంతో పాటు, మహిళలపై అత్యాచారాలు, హత్యకేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.మద్యం తాగితే మనిషి రాక్షసుడు అవుతాడని అదే ఐదారుగురు కలిసి మద్యం సేవిస్తే వారిలో ఆలోచనలు మారతాయన్నారు. అందుకే పర్మిట్ రూమ్ లను రద్దు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 43,000 బెల్ట్ షాపులను తీసివేసినట్లు జగన్ పేర్కొన్నారు.దిశ విషయంలో తెలంగాణ పోలీసులు సరైన శిక్ష అమలు చేసారని హ్యాట్సాఫ్ కేసిఆర్ అని జగన్ ప్రశంసించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp