జంట నగరాలను కలుపుతూ మరో నగరం

By Harinath.P Apr. 12, 2021, 02:55 pm IST
జంట నగరాలను కలుపుతూ మరో నగరం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంట నగరాలు అంటే హైదరాబాద్ - సికింద్రాబాద్ మాత్రమే జ్ఞప్తికి వచ్చేవి. అభివృద్ధి పరంగా రెండు నగరాలు కలిసిపోవడంతో హైదరాబాద్ కు విశ్వ నగరంగా పేరుగాంచింది. విడిపోయి, ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని చంద్రబాబు మరింత లూటీ చేయడంతో దివాళా దుస్థితి దాపురించింది.

ఖజానాలో కేవలం రూ.100 కోట్లను మాత్రమే ఉంచింది గత టీడీపీ ప్రభుత్వం. ఇలాంటి సమయంలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ - గుంటూరు నగరాలను కలిపేలా మరో నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

విజయవాడ - గుంటూరు మధ్య 35 కిలోమీటర్ల దూరం ఉంది. విజయవాడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి.. తాడేపల్లి నుంచి 8 కి.మీ. దూరంలో మంగళగిరి ఉన్నాయి. మంగళగిరి నుంచి గుంటూరు 15 కి.మీ. దూరంలో ఉంది. దీంతో తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ లుగా ఉండడంతో కొత్తగా ఏర్పాటు చేసే మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ద్వారా మరింత అభివృద్ధి సాకారమవుతుందన్న భావనలో ప్రభుత్వం ఉంది.

Also Read : టీడీపీకి పెద్దిరెడ్డి దిమ్మ తిరిగే స‌వాల్

మంగళగిరి మున్సిపాలిటీ, దాని పరిధిలో ఉన్న 11 గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు పట్టణ పరిధిలో ఉన్న 10 గ్రామాలు మొత్తం 21 గ్రామాలు.. రెండు మున్సిపాలిటీలు కలిపి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1994 ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి రూ.1000 కోట్లు కూడా కేటాయించింది. తాడేపల్లి - మంగళగిరి ప్రాంతాలు రాష్ట్రంలో అత్యంత కీలకమైన చెన్నై-కోల్ కతా హైవే పక్కనే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రధాన రహదారికి మధ్యలో ఉన్నాయి. రెండు పట్టణాల మధ్య రెండు, మూడు కిలోమీటర్ల మధ్యలోనే అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాలను విలీనం చేయడం సులువైంది. మరోవైపు తాడేపల్లి, మంగళగిరి పట్టణాల్లో కలిపి 2.25 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే కనీసం 3 లక్షల జనాభా ఉండాలి. దీంతో సమీపంలోని 21 గ్రామాలను కూడా విలీనం చేయడంతో జనాభా విషయంలో ఉన్న చిక్కు కూడా వీడిపోయింది.

పాలన వికేంద్రీకరణతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని నమ్మిన సీఎం జగన్ ... ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఆయనకు ఉంది. విజయవాడ - గుంటూరు లను కలుపుతూ కొత్తగా ఏర్పాటయ్యే కార్పొరేషన్ వల్ల ఒక మహా నగరం ఏర్పాటవుతుందనే విషయంలో సందేహం లేదు. నీటి వసతి చక్కగా ఉండడంతో మరికొన్ని సంవత్సరాలల్లో ఈ ప్రాంతం విశ్వ నగరంగా విరాజిల్లనుంది.

Also Read : వాలంటీర్లపై ప్రతిపక్షాల విమర్శలు.. ఒక్క మాటతో సమాధానం చెప్పిన సీఎం జగన్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp