NCRB Data Over Ganja - బాబు అబద్దాలు అతకడం లేదు ! గంజాయిపై వాస్తవాలు ఇవీ !

By Voleti Divakar Oct. 27, 2021, 06:00 pm IST
NCRB Data Over Ganja - బాబు అబద్దాలు అతకడం లేదు ! గంజాయిపై వాస్తవాలు ఇవీ !

వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచి దశాబ్దాలుగా గంజాయి సాగవుతున్నా ... వైఎస్ జగన్ సర్కారులో ఆంధ్రప్రదేశ్ గంజాయి సాగు , అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో దుష్ప్రచారం సాగిస్తున్నారు . అయితే వాస్తవ పరిస్థితులు , నార్కోటిక్స్ బ్యూరో , జాతీయ రికార్డులతో బాబు అబద్దాలకు అతకడం లేదు . దీంతో బాబు ఆరోపణలకు జాతీయస్థాయిలోనే కాదు ... రాష్ట్రస్థాయిలో కూడా పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు . మరోవైపు బాబు ఆదేశాలతో తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ నేతలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు . గంజాయి , హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల వినియోగంలో , ఎన్ డి పి ఎస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 18 వ స్థానంలో ఉన్నట్లు 2020 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో రికార్డులు స్పష్టం చేస్తున్నాయి . ఎన్ డి పి ఎస్ కేసుల్లో మొదటి , రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి .

ఈకేసుల్లో పొరుగున ఉన్న తమిళనాడు 3 వ స్థానంలో ఉండటం గమనార్హం . దేవతల భూమిగా చెప్పుకునే కేరళ 4 వ స్థానంలో ఉండటం మరింత విశేషం . కేరళవాసులు విశాఖ మన్యం , ఎఓబి సరిహద్దుల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని , ఇక్కడి నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు . ఎన్సిఆర్బి రికార్డుల ప్రకారం ఎన్ డి పి ఎస్ చట్టప్రకారం గత ఏడాది ఉత్తరప్రదేశ్లో 10 వేల 852 కేసులు , పంజాబ్లో 6 వేల 909 కేసులు , తమిళనాడులో 5 వేల 403 , కేరళలో 4968 కేసులు నమోదయ్యాయి . మహారాష్ట్ర 4714 కేసులతో 5 వ స్థానంలో నిలిచింది . ఏపీలో కేవలం 866 కేసులు మాత్రమే నమోదయ్యాయి . ఈ ఏడాది ఇప్పటి వరకు 1456 కేసులు నమోదు చేశారు . సుమారు 2.90 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు . గతంలో 3 వేల ఎకరాల్లో మాత్రమే గంజాయిని నిర్మూలిస్తే ఒక్క ఏడాదిలోనే 4500 ఎకరాల్లో గంజాయిని పంటను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు .

Also Read : Chandrababu Delhi Tour-చంద్ర‌బాబుకు ఇప్ప‌టికైనా అర్థ‌మైన‌ట్లేనా?

టిడిపి పాలనలో కన్నా మెరుగు...

గంజాయి సాగు , అక్రమ రవాణా , మాదకద్రవ్యాల వినియోగంపై పటిష్టమైన నిఘా పెట్టడంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కన్నా ఎన్టీపిఎస్ కేసులు తగ్గాయని రికార్డులు చెబుతున్నాయి . టిడిపి హయాంలో 2017-2019 మధ్యకాలంలో ఎన్ఎపిఎస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 16,17 వ స్థానాల్లో నిలవడం గమనార్హం . జగన్ సర్కారు హయాంలో ఒక్క ఏడాదిలో సుమారు 2.90 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు . గతంలో 3 వేల ఎకరాల్లో మాత్రమే గంజాయిని నిర్మూలిస్తే ఒక్క ఏడాదిలోనే 4500 ఎకరాల్లో గంజాయిని పంటను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు .

రాజమహేంద్రవరం వేదికగా సమరశంఖం..

డిజిపి గౌతమ్ సవాంగ్ రాజమహేంద్రవరం వేదికగా గంజాయిపై  సమరశంఖం పూరించారు . సుమారు నాలుగు గంటల పాటు ఆయన గంజాయిని నిర్మూలనపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు . బహుముఖ కార్యాచరణ వ్యూహాలతో చరిత్రాత్మక స్థాయిలో గంజాయిని నిర్మూలిస్తామని , ఈ విషయాన్ని మీరే చూస్తారుగా అని ఆయన వ్యాఖ్యానించారు . రాష్ట్రంలోని పోలీసు , రెవెన్యూ , అటవీశాఖ , ఐటిడిఏల సమన్వయంతో పాటు , ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఒడిశా , చత్తీస్ ఘడ్ , కర్నాటక , తమిళనాడు రాష్ట్రాల పోలీసులతో కలిసి గంజాయిపై ఉమ్మడిపోరుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సన్నద్ధమయ్యారు . గంజాయి పై పోరులో ఎన్ ఐ ఏ, ఎన్ సి ఆర్ బి సహకారాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించారు. రోడ్డు , రైలు , విమాన , నౌకాయానానికి అనువైన రాజమహేంద్రవరం గంజాయి రవాణాకు కీలకంగా మారడంతో గంజాయిపై పోరుకు ఇదే సరైన వేదికగా భావిస్తున్నారు.!

Also Read : Ganja Gorantla - ఈ వేళ గోర్లంట వంతు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp