ఏలూరు ఘటనపై 'నన్నయ్య' అధ్యయనం

By Voleti Divakar Dec. 10, 2020, 08:40 am IST
ఏలూరు ఘటనపై 'నన్నయ్య'  అధ్యయనం

ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థకు గురైన ఘటనపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను ఇచ్చేందుకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్యులు సిద్దమవుతున్నారు. వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాల అధ్యాపకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. దీనిలో వీసీ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు ప్రాంతంలో అనారోగ్య సమస్య పై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతగా ఏలూరులోని అనారోగ్య సమస్య పై అధ్యయనం చేస్తూ మరో వైపు ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పారు. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహకారంతో సేవలు అందించాలన్నారు. యూనివర్శిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అధ్యాపకులు డా.ఎ.మట్టారెడ్డి అధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందని తెలిపారు.

ఏలూరులో తాజాగా బయటపడిన వింతవ్యాధికి గల కారణాలను వెలికితీసేందుకు ఎయిమ్స్‌, డబ్లూహెచ్‌వో, సీసీఎంబీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా రోగుల శరీరాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ పరీక్షించినప్పుడు వాటిలో సీసం, నికెల్‌ ఉన్నట్లు గుర్తించారు. ఏలూరు ఘటన పై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించిన నేపథ్యంలో నన్నయ్య విశ్వవిద్యాలయం బృందం ఏ కొత్త విషయాలు బయట పెడుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp