Operation Hydravati - 'గరుడ' నవ్వుల పాలయింది.. ఇక ఇప్పుడు 'ఆపరేషన్ హైద్రావతి' వంతు!

By Balu Chaganti Oct. 26, 2021, 12:10 pm IST
Operation Hydravati - 'గరుడ' నవ్వుల పాలయింది.. ఇక ఇప్పుడు 'ఆపరేషన్ హైద్రావతి' వంతు!

సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు సినిమాల్లో రిటైర్ అయిపోయి రాజకీయాల్లోకి వస్తే ఏదైనా చేయొచ్చు అని భావించి శివాజీ ఆపరేషన్ గరుడ అని ఒక మహత్తర కట్టు కథ ఒక దాన్ని వినిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆపరేషన్ గరుడ పేరుతో దక్షిణ భారతాన్ని జయించడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని సినీ నటుడు శివాజీ అప్పట్లో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో శివాజీ తెలుగు రాష్ట్రాలను హస్తగతం చేసుకునే వ్యూహానికి ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టారని, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కోసం ఆపరేషన్ రావణ, కర్నాటకను హస్తగతం చేసుకునేందుకు ఆపరేషన్ కుమార పేర్లతో బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ వీడియోలో శివాజీ ఆరోపించారు. ఇదంతా కామెడీ అని తేలిపోయింది, ఇప్పుడు ఇలాంటిదే ఒక ఆపరేషన్ గురించి ఎంపీ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయి 20 ఏళ్లయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ కి సంబంధించిన పోస్టర్స్ లో ఎక్కడా మంత్రి కేటీఆర్ ఫోటోలు కనబడకపోవడం, అన్నింటా కేసీఆర్ మాత్రమే కనిపిస్తుండటం వెనుక పెద్ద కథే ఉందని చెబుతూ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఒక కథ చెప్పారు. ఇక దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కథ అని ఎందుకు అంటున్నాం అంటే, ఆయన చెప్పిన దానికి లాజిక్ ఏ మాత్రం లేకపోవడమే.

Also Read :   Vizag Steel Plant Pawan Kalyan -ఉక్కు ఉద్య‌మంలోకి జ‌నసేన : ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదన్న‌ ప్ర‌క‌ట‌నలో అంత‌ర్య‌మేంటి?

‘ఆపరేషన్ హైద్రావతి’ అనే పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేసిన అరవింద్ సీఎం కేసీఆర్ కుటుంబంలో తగాదాలు ఉన్నాయని, అందుకే కేటీఆర్ అను పక్కన పెట్టారని ఆరోపించారు. కేటీఆర్ తమిళనాడు పర్యటన వెనుక ఉద్దేశం మాకు స్టాలిన్ ఉన్నాడని వలస నేతలకు చెప్పడమే అంటున్నారు. అంతే కాక చంద్రబాబు, రాహుల్ గాంధీ, కేటీఆర్ కలిసి స్టాలిన్ తో ఏదో పెద్ద ప్లాన్ చేశారని ఆరోపించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ అయిన ఎంకే స్టాలిన్ తో కలిసి చేస్తున్న ఆపరేషన్ పేరే హైద్రావతని అందులో భాగంగా టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడయ్యాడని ఆరోపిస్తున్నారు. అంతేకాక పార్టీ పుట్టి 20 ఏళ్లయింది, ఇప్పుడు టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే పేరుతో మంత్రి కేటీఆర్ తమిళనాడుకు వెళ్లి డీఎంకే పని తీరును పరిశీలిస్తామని చెప్పడం కూడా ఆపరేషన్ లో భాగమేనని చెబుతున్నారు.

టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది వలసదారులు, తెలంగాణలో కాంగ్రెస్ ను, టీఆర్ఎస్ ను పోషించేది మైహోం రామేశ్వరరావు కాబట్టి నేతలెవరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు అని చెబుతూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. కాబట్టే కేటీఆర్ తన ఎమ్మెల్యేలను స్టాలిన్ దగ్గరకు తీసుకెళ్తున్నాడు. మనందరకీ స్టాలిన్ ఉన్నాడనే భరోసా కల్పించడానికి కేటీఆర్ అక్కడికి తీసుకు వెళ్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో నారా లోకేశ్, తెలంగాణలో కేటీఆర్ భవిష్యత్తు నేతలు అయ్యేలా పథకం రచించారని, చెబుతూ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో జరిగే చివరి ఎన్నిక హుజూరాబాద్ ఎన్నికలేనని దీని తర్వాత టీఆర్ఎస్ ను కేటీఆర్ చీల్చబోతున్నాడని ఆరోపణలు చేశారు. ఇక్కడ కేటీఆర్ తండ్రి స్థానం కోసం తాపత్రయపడుతున్నాడు అంటే అర్థం ఉంది, దానికి కాంగ్రెస్ ను ఎందుకు ఉపయోగించుకుంటారు? ఎలా ఉపయోగపడుతుంది. ఇందులో చంద్రబాబు, నారా లోకేష్ లకు హ్యాండ్ ఉన్నా వారేం చేయగలరు? అనేది ఆయనే చెప్పాలి. ఇలా ఏమాత్రం లాజిక్స్ లేకుండా ఆపరేషన్ హైద్రావతి అంటే నమ్మేయడమేనా? ఏంటో ఈ కధలు!

Also Read : KCR ,AP Power -ఏపీలో కరెంటు లేదా, కేసీఆర్ మాటల వెనుక మర్మమదే..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp