"మూడ్" ఆఫ్ ది నేషన్ - 3వ స్థానంలో జగన్

By Krishna Babu Aug. 08, 2020, 04:49 pm IST
"మూడ్" ఆఫ్ ది నేషన్ - 3వ స్థానంలో జగన్

తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికి మోస్ట్ పాపులర్ సిఎంలు ఎవరు అనే విషయంలో జాతీయ స్ధాయిలో ’సీ ఓటర్ ’జరిపిన సర్వేలో నాలుగవ స్ధానం దక్కించుకున్న జగన్ తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులెవరంటూ నిర్వహించిన టెలిఫోన్ సర్వేలో 3వ స్థానం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రిగా తాను నిర్వహించే బాధ్యతలు కొత్త అయినప్పటికి దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రజా రంజక పాలన అందిస్తున్న జగన్ అనేక సర్వేల్లో అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రులని సైతం పక్కకు నెట్టి పాలనలో తనకంటు ఒక ముద్ర వేసుకుంటున్నారు.

ఇక ఇదే సర్వేలో మొదటి స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యామంత్రి యోగి ఆదిత్యనాద్ నిలవగా , రెండవ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ నిలిచారు. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 9వ స్థానం దక్కింది. సర్వేలో అట్టడుగున మోడి సొంత రాష్ట్రం అయిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉండటం గమనార్హం. ఏదేమైనా ముఖ్యమంత్రి జగన్ ఇంత మంది సీనియర్లను వెనక్కు నెట్టి 3వ స్ధానంలో నిలిచారంటే అది ఆయన సమర్ధవంతంగా అందిస్తున్న సంక్షేమ పాలనే కారణం అని చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp