కోలుకుంటున్న ఆర్కే

By Sridhar Reddy Challa Feb. 29, 2020, 01:55 pm IST
కోలుకుంటున్న ఆర్కే

గత రాత్రి తాడేపల్లి మండలంలోని ఉండవల్లి లో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి (ఆర్కే) కి తృటిలో ప్రమాదం తప్పింది. వివాహానికి హాజరయిన ఎమ్మెల్యే వేదిక మీదకు చేరుకొని వధూవరులని ఆశీర్వదించే సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వివాహవేదిక కూలిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఎమ్మెల్యే ఆర్కే కిందపడ్డారు. దింతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అనుచరులు, భద్రతా సిబ్బంది ఆయన్ని లేపి హుటాహుటిన గుంటూరు లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో ఆయన కుడి కాలు కిందమడం భాగంలో గాయం అయ్యినట్టు వైద్యులు తెలిపారు.

గాయపడిన ఎమ్మెల్యే కు వైద్యులు చికిత్స చేసి కాలుకు పిండికట్టు కట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు 5 వారల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఆయన తన సొంత ఇంటికి చేరుకున్నారు. ఐతే ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తొలుత కంగారు పడ్డారు. అయితే ఆర్కేకి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుసుకున్న ఆయన అనుచరులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటివద్ద ఉన్న ఎమ్మెల్యేను ఈరోజు ఉదయం నుండి అభిమానులు, కార్యకర్తలు పరామర్శిస్తున్నారు.

ఐతే ఈ ఘటన లో గాయపడిన కొందరికి చిన్న చిన్న గాయాలవడంతో వారిని విజయవాడలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వివాహవేదిక కూలిపోవడం తో అక్కడే ప్రత్యామ్న్యాయ వేదికని ఏర్పాటు చేసి ఆ వివాహాన్ని జరిపించారని తెలుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp