కసబ్ కేసు విచారిస్తున్నారు.. వీరినెందుకు ఎన్కౌంటర్ చేశారు

By Kotireddy Palukuri Dec. 06, 2019, 08:48 pm IST
కసబ్ కేసు విచారిస్తున్నారు.. వీరినెందుకు ఎన్కౌంటర్ చేశారు

దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడం సరికాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి అన్నారు. తాను ఎన్కౌంటర్లకు వ్యతికేకమన్నార. న్యాయ స్థానాల్లో విచారణ జరిపి చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉందన్నారు. దిశకు న్యాయం జరగాలని మేమంతా(ఎంపీలు) కోరుకున్నామన్నారు. ఐతే వ్యక్తిగత ఎన్కౌంటర్లు సరికాదన్నారు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ లాంటి వ్యక్తుల కేసులు ఇప్పటికి విచారణ చేస్తున్నారని, కేసు వాయిదాలు పడుతోందని పేర్కొన్నారు. అలాంటిది దిశ కేసులో విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.

ఎన్కౌంటర్ పోలీసుల సమక్షంలోనే జరిగిందని, దీనిపై మెజిస్ట్రియల్ విచారణ జరగనుందని అసదుద్దీన్ పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై వివరణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తుచేశారు. కాగా, దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపేసిన ఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp