డయేరియా అనుకుని పెళ్లి తంతు.. పెళ్లి కొడుకు మృతి..110 మందికి వైరస్‌..

By Kotireddy Palukuri Jul. 03, 2020, 10:46 am IST
డయేరియా అనుకుని పెళ్లి తంతు.. పెళ్లి కొడుకు మృతి..110 మందికి వైరస్‌..

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ 350 మందితో పెళ్లి వేడుక చేసిన ఫలితంగా 110 మంది కరోనా బారిన పడ్డారు. వేడుకలో వైరస్‌ సోకేందుకు పెళ్లికొడుకే హాట్‌స్పాట్‌గా మారిన ఘటన బిహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పెళ్లి కొడుకు మృతి చెందాడు. ఈ విషయం వారు గోప్యంగా ఉంచినా ఆ వీధిలోని వ్యక్తి సమాచారంతో వెలుగులోకి వచ్చింది. పాట్నాకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి కుదురింది. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు అతను కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. స్థానికంగా ఓ ఆస్పత్రిలో చూపించారు. డయేరియా అనుకుని పెళ్లి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పెళ్లికూతురు వారు నిరాకరించినా.. వారిపై ఒత్తిడి తెచ్చి వివాహం జరిపించారు.

వివాహం జరిగిన మూడు రోజులకు పెళ్లికొడుకు మృతి చెందాడు. అతని అంత్యక్రియలు కుటుంబ సభ్యులే పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా ఈ విషయం కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ఆ వీధికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు పెళ్లికి దాదాపు 350 మంది హాజరైనట్లు గుర్తించారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 110 మందికి వైరస్‌ సోకినట్లు నిర్థారించారు. వీరందరిని ఆస్పత్రికి తరలించారు. వీరు ఎవరెవరితో కలిశారనే అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పెళ్లి కూతుకు మాత్రం వైరస్‌ సోకకపోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి వివాహ పెళ్లికుమారుడు తరఫు వారిపై అధికారులు కేసు నమోదు చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp