నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

By Kiran.G Dec. 10, 2019, 12:53 pm IST
నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసానని, నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారని, కానీ తెలుగుదేశం పార్టీ తన అనుకూల పత్రికలతో కలిసి తనపై దుష్ప్రచారం చేసారని తనను తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసారని వల్లభనేని వంశీ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వల్లభనేని వంశి మాట్లాడటానికి ప్రయత్నించగా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.వంశీ ప్రసంగాన్నిటీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక శాసన సభ్యుడిగా అసెంబ్లీలో మాట్లాడే హక్కు వంశీకి ఉందని స్పష్టం చేసారు. దీనితో వల్లభనేని వంశీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రిని కలిస్తే టీడీపీ సభ్యులు తన అనుకూల మీడియాతో కలిసి తనపై బురదజల్లడానికి ప్రయత్నించిందని, వల్లభనేని వంశీ తెలిపారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని వాళ్ళు కూడా తనని విమర్శిస్తున్నారని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. వైస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అనేకమందికి లాభం కలిగిందని వంశీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం వల్ల సమాజానికి మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. నాపై టీడీపీ దుష్ప్రచారం చేసిందని, ఇక తను టీడీపీలో కొనసాగలేనని వారితో కలవలేనని, కాబట్టి తనని ఒక ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేసారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారం చర్చకు వస్తుంది.వైశ్రాయ్ సంఘటనప్పుడు ఎన్టీఆర్ టీతో నిలిచిన మోత్కుపల్లి నర్సింహులు 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి కొంత కాలం తరువాత టీడీపీకి సన్నిహితంగా వ్యవహరించేవాడు.శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల మీద మాటల యుద్దానికి దిగేవాడు. కాంగ్రెస్ తో తనకు విబేధాలు వచ్చాయని,తననుప్రత్యేక సభ్యుడిగా గుర్తించామని కోరగా అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి ఆయనకు కాంగ్రెస్ సభ్యులకు దూరంగా స్థానాన్ని కేటాయించింది.

ఇప్పుడు వంశీని టీడీపీ బహిష్కరించింది కాబట్టి స్పీకర్ ఆయనకు ప్రత్యేక స్థానం, బహుశా జనసేన ఎమ్మెల్యే పక్కన సీట్ కేటాయించవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp