సోనియా, ప్రియాంక‌ల‌ను కాదని మ‌న్మోహ‌న్ కే ఓటు

By Kalyan.S Aug. 08, 2020, 09:45 pm IST
సోనియా, ప్రియాంక‌ల‌ను కాదని మ‌న్మోహ‌న్ కే ఓటు

గ‌తేడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యం పొంద‌డంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే గ‌త ఆగ‌స్టు నుంచీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. ఆమె ప‌ద‌వీ కాలం మ‌రికొన్ని రోజుల్లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎవ‌రైతే బాగుంటుంద‌నే అంశంపై ‘ఇండియాటుడే - కార్వీ ఇన్‌సైట్స్ సంస్థలు ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ అన్న పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఈ స‌ర్వేలో అత్య‌ధిక మంది రాహుల్ గాంధీ అత్యంత అనువైన వ్యక్తి అని తెలిపారు. ఇందులో 12,021 పాల్గొనగా.... 23 శాతం మంది ప్రజలు ఎంపీ రాహుల్‌ గాంధీ వైపు మొగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ అయితే బాగుంటుందని తేల్చారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా త‌ర్వాత ఎవ‌ర‌నేదానిపై స‌ర్వేలో పాల్గొన్న వ్య‌క్తులు సోనియాను కాద‌ని మ‌రో ముఖ్య‌నేత‌కు ఓటు వేశారు.

రెండో స్థానంలో మ‌నోహ్మ‌న్..

రాహుల్ గాంధీ త‌ర్వాత ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి అనువైన వ్య‌క్తి ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా అనూహ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్ర‌జ‌లు ఓటు వేశారు. ఒక‌వేళ అధ్య‌క్షుడిగా ఉండేందుకు రాహుల్ మ‌ళ్లీ స‌సేమిరా అంటే మాజీ ప్రధాని మన్మోహన్ అయితే బాగుంటుందని 18 శాతం మంది అభిప్రాయప‌డ‌డం గ‌మ‌నార్హం. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కాదని మ‌రీ సర్వేలో మన్మోహన్ వైపు మొగ్గ‌డం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. 18 శాతం మంది మ‌న్మోహ‌న్ ను కోరుకోగా.. 14 శాతం మంది ప్రియాంక, సోనియా అధ్యక్షులైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇద్ద‌రికీ స‌మాన ఓట్లు వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్ష బాధ్యతల్లో ఉంటే బాగుంటుందని ఎంపీలందరూ కొన్ని రోజుల కిందటే సోనియాతో అన్నట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp