అంతా ఢిల్లీ బాట పడుతుంటే... ఢిల్లీ మాత్రం ఏపీ వైపు చూస్తోంది!

By Voleti Divakar Jan. 18, 2021, 08:25 pm IST
అంతా ఢిల్లీ బాట పడుతుంటే... ఢిల్లీ మాత్రం ఏపీ వైపు చూస్తోంది!

దేశంలోని రాష్ట్రాలన్నీఢిల్లీలో అమలు జరుగుతున్న విద్యావిధానంపై అధ్యయనం చేస్తున్నాయి. కానీ నాకు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యారంగ సంస్కరణలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏపీ తరహా విద్యావిధానం దేశానికి ఎంతో అవసరం. ఏపీ విద్యారంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన పథకాలను అధ్యయనం చేసి,అమలు చేసేందుకు త్వరలో ఉన్నత స్థాయి బృందాన్నిఏపీకి పంపుతాము'. ఈ విషయాన్ని దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన లేక వెనుకబడిన రాష్ట్రానికి చెందిన మంత్రో చెప్పలేదు. ఇటీవలే దేశంలోనే ద్వితీయ ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన కేజ్రీవాల్ పాలిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి, ఆరాష్ట్ర విద్యాశాఖ మనీష్ శిసోడియా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏపీలో అమలు చేస్తున్న విద్యారంగ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఏపీ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.ఢిల్లీలో జరుగుతున్న విద్యాసదస్సులో ఆయనీ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంత రించుకున్నాయి. ఈ సదస్సులో ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. పాలకుల చిత్తశుద్ధి కారణంగానే ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయన్న విషయాన్ని మనీష్ శిసోడియా గుర్తించారు. ఢిల్లీలో విద్యాభివృద్ధిపై ఏపీతో కలిసి పనిచే సేందుకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న వసతి దీవెన వంటి పథకాలపై ఢిల్లీతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 18శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ సదస్సులో వివరించారు. ఏది ఏమైనా ఏపీలోని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ సంక్షేమ పథకాలపై ఎన్ని విమర్శలు చేసినా జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ పనితీరుకు ప్రశంసలు, పురస్కారాలు లభించడం అభినందనీయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp