సంపూర్ణ లాక్‌డౌన్‌లోకి మరో రాష్ట్రం

By Srinivas Racharla Jul. 23, 2020, 11:01 am IST
సంపూర్ణ లాక్‌డౌన్‌లోకి మరో రాష్ట్రం

దేశంలోని అన్ని ప్రాంతాలకు కరోనా రక్కసి తన విషాన్ని విరజిమ్ముతూనే ఉంది. అనునిత్యం కొత్తగా కరోనా సోకిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.కరోనా కట్టడి కోసం మరొకసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కానీ ప్రజల ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థని కాపాడటం కూడా తమ బాధ్యత అని ప్రభుత్వాలు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం కాదని స్పష్టం చేస్తున్నాయి. ప్రజలే స్వీయ రక్షణ చర్యలు చేపడుతూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.కొన్ని ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిధిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో,జిల్లాలలో కఠినతరమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

ఐతే కొన్ని రాష్ట్రాలు మాత్రం కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి సంపూర్ణ లాక్‌డౌన్‌‌నే అని బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటికే బీహార్‌లో నితీశ్‌ ప్రభుత్వం జూలై 31 వరకు 15 రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది.తాజాగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడవనుంది.

మణిపూర్‌లో 14 రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ (జూలై 23) మధ్యాహ్నం 2 గంటల నుండి ఆగస్టు 5వ తేదీ వరకు పూర్తిస్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .ఐతే ఎమర్జెన్సీ సర్వీసులకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ఇక మణిపూర్‌లో 2,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 1400 మంది కరోనాపై విజయం సాధించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో వైరస్ కారణంగా ఎవరు మరణించలేదు. ప్రస్తుతం మణిపూర్‌లో 615 మంది కరోనాతో పోరాడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp