దొరికిన తబ్లిగీ సభ్యులు

By Phani Kumar Apr. 05, 2020, 06:35 pm IST
దొరికిన తబ్లిగీ సభ్యులు

ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో ప్రార్ధనలు జరిపిన తబ్లిగీ సంస్ధకు చెందిన ఆరుగురు సభ్యులు దొరికారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తబ్లిగి సంస్ధ నిర్వహించిన మత ప్రార్ధనలు కు హాజరైనవారి వలన దేశంలో అనేక ప్రాంతాలను వైరస్ వ్యాప్తి చెందింది. నిజానికి ఓ వారం క్రితం వరకు దేశంలో కరోనా వైరస్ అన్నది నియంత్రణలో ఉందని భావిస్తున్న సమయంలో . మార్చి 1-15 మధ్య జరిగిన ప్రార్ధనలకు హాజరైన వారి వలన సీన్ మొత్తం మారిపోయింది.

ప్రార్ధనల తర్వాత తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన వారిలో కొందరి వల్ల వైరస్ సమస్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎందుకంటే విదేశాల నుండి ప్రార్ధనల కోసమని వచ్చిన 1500 మంది వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రార్ధనలకు హాజరైన సుమారు 12 వేల మందిలో చాలామందికి వైరస్ అంటుకున్నది. అలా వైరస్ సోకిన వాళ్ళంతా తమ సొంతూర్లకు వెళ్ళటం వల్ల వాళ్ళ నుండి మరికొందరికి పాకుతోంది. అంటే కమ్యూనిటి ట్రాన్స్ మిషన్ జరుగుతోందన్నమాట.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ప్రార్ధనలు నిర్వహించిన తబ్లిగి సంస్ధ సభ్యులను పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినపుడు చాలామంది తప్పించుకున్నారు. కొందరు స్వచ్చందంగా పరీక్షలకు హాజరు కాగా మరొకొందరు ఇన్ని రోజులు తప్పించుకునే తిరుగుతున్నారు. అటువంటి వారిలో ఎనిమిది మందిని  పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు.

వీళ్ళంతా మలేషియా నుండి ఢిల్లీకి వచ్చారు. వీరిలో ఎంతమందికి వైరస్ సోకిందో తెలీదు. తమ గురించి పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని వీరు మసీదులో నుండి పారిపోయారు. ఇన్ని రోజులు ఢిల్లీలోనే ఎక్కడో దాక్కున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇండియా నుండి మలేషియాకు ప్రత్యేక విమానాం వెళుతోందన్న విషయం తెలుసుకుని ఆరుగురు విడివిడిగా విమానాశ్రయం దగ్గరకు చేరుకున్నారు. అయితే అప్పటికే వీళ్ళ వివరాలు సేకరించిన పోలీసులు ఎయిర్ పోర్టు దగ్గర కాపుకాసి వెంటనే పట్టుకున్నారు. వీళ్ళపైన కేసు పెట్టి తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అప్పగించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp