స్వాములందు 'ఆనంద గిరి' వేరయా, మొదటి నుంచి వివాదాలే!

By Balu Chaganti Sep. 22, 2021, 09:30 pm IST
స్వాములందు 'ఆనంద గిరి' వేరయా,  మొదటి నుంచి వివాదాలే!

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి కేసులో ఆయన శిష్యుడు ఆనంద్ గిరిని పోలీసులు అరెస్టు చేశారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. అతని మృతదేహం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లోని బాఘంబరి మఠంలోని గదిలో కనుగొనబడింది. ఆయన తన సూసైడ్ నోట్‌లో, తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి, ప్రభుత్వం SIT ఏర్పాటు చేసింది.

ఈ సూసైడ్ నోట్‌లో మరో ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా రాశారు. అయితే ఆనంద్ గిరి అరెస్టుకు ముందు కూడా తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ ఖండించారు. అయితే యుపి పోలీసులు ఆనంద్ గిరిని అరెస్టు చేశారు సరే ఇంతకీ ఆనంద్ గిరి ఎవరు? అతను మహంత్ నరేంద్ర గిరిని అసలు ఎలా చేరుకున్నాడు ? ఆయన శిష్యుడిగా ఎలా మారాడు ? మహంత్ నరేంద్ర గిరి ఒకప్పుడు తన వారసుడు అని పిలిచినా వ్యక్తి ఇప్పుడు మరణానికి ఎలా కారణం అయ్యాడు? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఆనంద్ పేరు వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. లగ్జరీ కార్లలో తిరగడం నుండి విదేశాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు వరకు ... ఆనంద్ గిరి వార్తల్లో నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆనంద్ గిరి యొక్క విలాసవంతమైన జీవనశైలి గురించి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

ఆనంద్ గిరి ఎవరు?

ఆనంద్ గిరి రాజస్థాన్ లోని భిల్వారాలోని అసింద్ ప్రాంతంలో సరెరి గ్రామ నివాసి. అతని అసలు పేరు అశోక్ కాగా అతని తండ్రి పేరు రామేశ్వర్ లాల్ చోటియా. నలుగురు మగపిల్లల్లో అశోక్ చిన్నవాడు. నిజానికి, 1997 సంవత్సరంలో, 12 సంవత్సరాల వయస్సులో, ఆనంద్ తన ఇంటి నుంచి పారిపోయి హరిద్వార్ వెళ్లాడు. ఆయన హరిద్వార్‌లో నరేంద్ర గిరిని కలిశారు. నరేంద్ర గిరిని కలిసినప్పుడు మీకు ఏమి కావాలి అని అడగగా ఆనంద్ తాను చదువుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు, దీంతో నరేంద్ర గిరి ఆనంద్ కు చదువుకునే అవకాశం కల్పించడంతో ఆ తర్వాత ఆయన సన్యాస దీక్ష పొందారు.

Also Read : అదానీ రావడం లేదని నాడు - వచ్చేస్తున్నాడని నేడు, ఆంధ్రజ్యోతి అక్కసు రాతలు

టీవీ చూసి గుర్తించిన కుటుంబ సభ్యులు

సాధు జీవితం మొదలు పెట్టాక ఆనంద్ గిరి ఉపన్యాసం సంస్కార్‌ టీవీ ఛానెల్లో వచ్చేది, దీంతో అతని కుటుంబ సభ్యులు చూసి గుర్తించారు. 2012 లో, మహంత్ నరేంద్ర ఆనంద్ గిరితో కలిసి గ్రామానికి వచ్చారు. నరేంద్ర గిరి కుటుంబం ముందు సన్యాస దీక్ష పొందారు, అప్పుడు అశోక్ కాస్తా ఆనంద్ గిరి అయ్యాడు.

విదేశాల్లో పర్యటనలు

తనను తాను 'సంచార యోగి'గా అభివర్ణించుకునే ఆనంద్ గిరి, ప్రయాగరాజ్ సంఘం ఒడ్డున ఉన్న ప్రసిద్ధ బడే హనుమాన్ దేవాలయంలోని చిన్న మహంత్‌గా బాగా ఫెమస్ అయ్యారు. అయితే ఆనంద్ గిరి సామాన్యుడిలా జీవనం సాగించడు. ఎందుకంటే కట్టేది కాషాయం అయినా ఆయన జీవన శైలి సెలబ్రిటీలాగానే ఉంటుంది. లగ్జరీ కారుల్లో ప్రయాణం, విమానాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, సెలబ్రిటీలను తలదన్నే ఫోటోషూట్ లతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తరచుగా అతను విదేశాలను సందర్శిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆనంద్ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్‌తో సహా అనేక దేశాలకు తిరుగుతాడు.

లైంగిక ఆరోపణలు - ఆస్ట్రేలియాలో అరెస్టు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మహిళపై బెడ్‌రూమ్‌లో లైంగిక దాడి చేసినందుకు మహంత్ ఆనంద్ గిరిని ఒకసారి అరెస్టు చేశారు. అయితే, అప్పుడు మహంత్ నరేంద్ర గిరి, మహంత్ ఆనంద్ గిరిని సమర్థిస్తూ, 'అతడిని నిందితుడిగా మార్చారు, అని అన్నారు. ఇది కాకుండా, 2016 లో నూతన సంవత్సరాది సంధర్భంగా రూటీ హిల్‌లోని ఒక ఇంట్లో పూజలో పాల్గొంటున్నప్పుడు మహంత్ ఆనంద్ గిరి బెడ్‌రూమ్‌లో మహిళపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసు ఎంత దూరం వెళ్ళనుందో చూడాలి మరి.

Also Read : మహంత్‌ నరేంద్రగిరి ఆత్మహత్య.. అసలేం జరిగింది.. కారణాలు ఏంటంటే..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp