చరిత్ర తిరగరాయలనుకున్నా కానీ....

By Surendra.R Dec. 11, 2019, 12:39 pm IST
చరిత్ర తిరగరాయలనుకున్నా కానీ....

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఏపీ సర్కార్ పెంచిన బస్సు ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరిలో బుధవారం ఉదయం జరిగిన నిరసన కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేను ఏ తప్పు చేయకపోయినా తనపై ఆరోపణలు చేస్తున్నారని, తెలుగు తప్పుగా మాట్లాడుతున్నారంటూ హేళన చేస్తున్నారని మండి పడ్డారు.నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదని, వ్యక్తిగత విమర్శలు ఆపేసి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అధికార పార్టీ నాయకులకు లోకేష్ హెచ్చరించారు. 

టీడీపీ 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవలేదని, అక్కడ గెలిచి చరిత్ర తిరగరాయలనే పోటీ చేశానని అన్నారు. ఓడిపోయినా మంగళగిరిలోనే తిరుగుతున్నానని, ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నానని లోకేష్ పేర్కొన్నారు.

దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని నారా లోకేష్ ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp