ముద్దొస్తున్నాడని పక్కింటి పిల్లాడికి మీ ఇంటిపేరు పెట్టుకున్నట్టే

By Ravuri.SG Dec. 07, 2019, 08:24 am IST
ముద్దొస్తున్నాడని పక్కింటి పిల్లాడికి మీ ఇంటిపేరు పెట్టుకున్నట్టే

'ముద్దొస్తున్నాడని పక్కింటి పిల్లాడికి మీ ఇంటిపేరు పెట్టుకున్నట్టే' అంటూ ట్విట్టర్ వేదికగా మూడు శాఖల మాజీ మంత్రి నారా లోకేష్ చెలరేగిపోయారు. పాపం ఆయనకు చరిత్ర తెలిసుంటే ఇలాంటి మాటలు ముందు ఎవరిని అనాలో అర్ధమయ్యేది ...

హైదరాబాద్ హైటెక్ సిటీ ఐడియా కానీ, ఐటీ రంగాన్ని మన దేశానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో కానీ కీలక పాత్ర పోషించింది రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులు. కేవలం వారి మేధస్సు, ముందుచూపు, ఆలోచనల ఫలితమే - 1992 మే 21న హైదరాబాద్ లోని మాదాపూర్లో 'సైబర్ టవర్స్' నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన. కనీసం ఆ శిలాఫలకం కూడా లేకుండా చేసిన 'ఘన' చరిత్ర చంద్రబాబుది అనే సంగతి ఇప్పటికీ చినబాబుకు తెలిసినట్టు లేదు.

'చంద్రన్న ప్రారంభించిన కియాకి మళ్ళీ రిబ్బన్ కట్ చేయడానికి సిగ్గనిపించలేదా ?' అంటూ ఘాటుగా, హద్దు మీరి ట్వీటారు లోకేష్. కానీ జనవరిలో జరిగిన ట్రయల్ లాంచ్ కార్యక్రమంలోనే 'సెప్టెంబర్ - అక్టోబర్లో కియా కమర్షియల్ లాంచ్ ఉంటుంది. దానికీ నేనే వస్తా' అని చంద్రబాబు అన్న మాట గుర్తుండుంటే ఇలా ట్వీటేందుకు కాస్త ఆలోచించుంటారు. కియా అనంతపురం ప్లాంటులో తమ మొదటి కారు సిద్ధమైందని, ఆ కార్ ప్రారంభోత్సవానికి రావాలని 'కియా' ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆగస్టులో ఆహ్వానించారు. అంటే జనవరిలో 'ట్రయల్ ప్రొడక్షన్' కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన పది కార్లు అక్కడ తయారైనవే అన్నట్టు ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినవారికి ఎంత సిగ్గనిపించాలో కూడా ట్వీటు చేసుంటే బాగుండేది !

అసలు మొన్న ప్రారంభమైన కియా ఫ్యాక్టరీకి, అక్కడ గతంలో జరిగిన కార్యక్రమాలకు తేడాను లోకేష్ బాబు గుర్తించడం అసాధ్యం , కానీ ఎప్పటిలాగే "అంతా మేమే" చేశాం అంటూ ట్విట్టర్లో చెలరేగిపోయాడు. 'కియా మోటార్స్' ఇక్కడకు రావడానికి వెనుక ఉన్న అసలు చరిత్ర  చదవండి  - కియా మోటార్స్ 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp