లోకేష్ ఆలోచనాస్ధాయి ఇంతకన్నా ఎదగదా ?

By Kiran.G Mar. 31, 2020, 12:30 pm IST
లోకేష్ ఆలోచనాస్ధాయి ఇంతకన్నా ఎదగదా ?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆలోచనా స్ధాయి ఎప్పటికీ ఎదగదేమో ? ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వెంటనే దాన్ని ట్విట్టర్లో పెట్టి ప్రచారం చేసేయటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. తాజాగా కొందరు యువకులు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి ప్రచారం చేయటమే ఉదాహరణగా నిలిచింది.

తెలంగాణా నుండి కొందరు యూత్ ఏపిలోకి ఎంటర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో కొందరు రాజమండ్రికి చేరుకున్నారు. వాళ్ళందరినీ ప్రభుత్వం బొమ్మూరులోని ఏపి టిడ్కో అపార్ట్ మెంట్లలో ఉంచి కొరోనా వైరస్ టెస్టులు చేయించింది. అందరికీ నెగిటివ్ రిపోర్టే వచ్చింది. అయితే నెగిటివ్ రిపోర్టు వచ్చినా బహుశా ఓ రెండు రోజులు ఉంచి మళ్ళీ టెస్టు చేసి పంపేద్దామని అనుకున్నదేమో. అందుకనే వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లలోనే ఉంచేసింది.

యూత్ ఏమంటారంటే తమకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది కాబట్టి పంపేస్తామని ముందు చెప్పి ఇపుడు పంపట్లేదని మండిపోతున్నారు. తమకేదో అన్యాయం జరిగిపోతోందని ఓ వీడియోలో మాట్లాడి దాన్ని వాట్సప్ లో పంపేశారు. తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నాడంటూ జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలిచ్చారు. అలాగే భోజనాలు కూడా రుచిగా లేవంటూ మండిపోయారు. ఇంకేముంది ఆ వీడియోలను పట్టుకుని లోకేష్ వాళ్ళకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ట్విట్టర్లో పెట్టేసి ప్రచారం చేస్తున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకసారి టెస్ట్ చేసినపుడు నెగిటివ్ వచ్చింది కాబట్టి రెండు రోజులుంచుకుని మళ్ళీ టెస్టులు చేద్దామని ప్రభుత్వం అనుకునుండచ్చు. ఇందులో తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే బయట పరిస్ధితి అంత భయంకరంగా ఉంది. ఇక భోజనాలంటారా యూత్ వెళ్ళింది ఎవరిదో పెళ్ళికి కాదు రుచులు వడ్డించటానికి. ఎవరు కూడా ఆకలితో ఉండకుండా కడుపు నింపటానికి అప్పటికప్పుడు తయారు చేయించి భోజనాలు అందిస్తున్నారు. సరే యూత్ అంటే ఏదో ఆవేశంతో అన్నారని అనుకుందాం. మరి లోకేష్ కు ఏమైంది ? గుడ్డిగా జగన్ ను వ్యతిరేకించటం కాకుండా కాస్త ఆలోచన కూడా పెంచుకుంటే బాగుంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp