లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

By Amar S Dec. 11, 2019, 10:18 am IST
లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది.

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో మంగళగిరిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లోకేష్ బస్సు ఎక్కి టిక్కెట్టు తీసుకుని కొద్దిసేపు ప్రయాణించి తన నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో లోకేష్ బస్సు నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఆయన ప్రోగ్రాం కవర్ చేస్తున్న డ్రోన్ కెమెరా లోకేష్ ముందు పడిపోయింది. కొంచెం ఉంటే ఆ డ్రోన్ లోకేష్ పై పడి ఉండేది. డోన్ కెమెరా పైనున్న విద్యుత్ వైర్లు తగిలి లోకేష్ ముందు పడింది. ఒక్కసారిగా డ్రోన్ పడిపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp