రైతుల‌ను అప్పుల పాలు చేసిన బాబు.. నేటికీ వెంటాడుతున్న‌ వ‌డ్డీలు

By Kalyan.S Sep. 29, 2020, 08:00 am IST
రైతుల‌ను అప్పుల పాలు చేసిన బాబు.. నేటికీ వెంటాడుతున్న‌ వ‌డ్డీలు

ఎలాగైనా తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి తేవాల‌నే ఉద్దేశ్యంతో చంద్ర‌బాబునాయుడు నాడు తెగ హామీలు గుప్పించారు. అలా 2014లో తెర‌పైకి వ‌చ్చిన ఓ హామీ రైతుల‌ను న‌ట్టేట ముంచింది. అప్పుల కుప్ప‌లోకి నెట్టేసింది. తినో తిన‌కా ఉన్న దాంట్లో ఎంతో కొంతగా బాకీలు తీరుస్తూ అప్పులు తీర్చుకుంటున్న రైతులు చంద్ర‌బాబు మాట న‌మ్మి రుణాలు చెల్లించ‌డం ఆపేశారు. రైతు రుణ మాఫీ ప‌థ‌కం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్న‌దాత‌ల‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఎలాగూ రుణ మాఫీ ఉంది క‌దా అని ఏటా జ‌మ క‌ట్ట‌డంలో అశ్రద్ధ క‌న‌బ‌ర్చ‌డం ఇప్పుడు వారికి శాపంగా మారింది. రుణ మాఫీ పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌క‌పోవ‌డంతో తీసుకున్న రుణం కంటే వ‌డ్డీల‌కు వ‌డ్డీలు త‌డిపి మోపెడై అన్న‌దాత‌ల‌ను ఆందోళ‌నకు గురి చేస్తున్నాయి.

ఐదేళ్ల‌లో రెండు విడ‌త‌లు గానే...

అప్ప‌ట్లో తెలుగుదేశం ప్ర‌భుత్వం ప్ర‌తీ రైతుకు రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. రూ. 50 వేలు అయితే ఒకేసారి మాఫీ చేస్తామ‌ని చెప్పింది. నాటి లెక్క‌ల ప్ర‌కారం 33 ల‌క్ష‌ల మందికి రూ. 24 వేల కోట్లు రుణ మాఫీ చేయాల్సి ఉంది. రుణ‌మాఫీ ఆశ‌ల‌తో రైతులంతా 2013 నుంచి కూడా కో ఆప‌రేటివ్ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు నుంచి తీసుకున్న రుణాల‌ను చెల్లించ‌డం ఆపేశారు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 2015 వ‌ర‌కు కూడా రుణ‌మాఫీ అమ‌లు చేయ‌లేదు. 2015 నుంచి 2019 అధికారం ముగిసే లోపు కేవ‌లం రెండు విడ‌త‌లు మాత్ర‌మే రుణమాఫీ చేసింది. అంటే స‌గం మాత్ర‌మే అమ‌లు చేసింది. దీంట్లోనూ కొంద‌రికి తిర‌కాసుల‌తో చేయిచ్చింది. అప్ప‌టికే రైతుల రుణాలు బ‌కాయిల‌తో వ‌డ్డీల‌తో క‌లిసి మ‌ళ్లీ పెరిగిపోయాయి.

న‌మ్మి ముంచేసిన టీడీపీ

తెలుగుదేశం ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో రైతులు అప్పుల పాల‌య్యారు. రూ. 1.50 ల‌క్ష‌ల రుణం ఉన్న రైతుకు మ‌ళ్లీ ఆ రుణం కాస్తా వ‌డ్డీతో స‌హా ఏకంగా 3 ల‌క్ష‌ల వ‌ర‌కూ పెరిగిపోయింది. నాడు తెలుగుదేశం ప్ర‌భుత్వం మోస‌పూరిత హామీ ఇవ్వ‌క‌పోతే రైతులు ఏటా రుణాల‌ను చెల్లిస్తూ వ‌చ్చేవారు. అలా చాలా వ‌ర‌కూ భారం తీరేది. రుణాలు క‌ట్ట‌కండి.. మేం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తీర్చేస్తాం.. అంటూ చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌ల‌ను న‌మ్మి రైతులు రుణాలు తీర్చ‌డంలో అశ్ర‌ద్ధ క‌న‌బ‌రిచారు. ఇప్పుడది వారికి అస‌లు, వ‌డ్డీలు క‌లిపి త‌ల‌కు మించిన భారంగా మారాయి.

అదే బాబుకు, జ‌గ‌న్ కు తేడా

అధికారంలోకి వ‌చ్చేందుకు హామీలు గుప్పించి అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైన చంద్ర‌బాబుకు, ఇచ్చిన మాట‌కు మించి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న జ‌గ‌న్ కు తేడా సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని భావిస్తున్న జ‌గ‌న్ రైతుల‌ను ఆదుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా‌’ పథకం తో రైతుల‌కు ఎంతో మేలు చేస్తోంది. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. తొలి ఏడాదిలోనే రూ.6350 కోట్లు రైతు భరోసా కింద ప్ర‌భుత్వం చెల్లించింది. రెండో సారి రైతుల ఖాతాల్లో మ‌రో రూ.2,800 కోట్లు జమ చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు ఈ మొత్తాన్ని జ‌మ చేశారు. రెండో సారి తొలి ఏడాది కంటే 2.74 లక్షల రైతుల‌కు అధికంగా భ‌రోసా క‌ల్పించారు. చంద్ర‌బాబు చేసిన మోసానికి అప్పుల పాలైన రైతులు.. జ‌గ‌న్ భ‌రోసాతో ఆర్థికంగా ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp