రిమ్స్ ఆస్పత్రి నుండి రిమ్స్‌ డైరక్టర్ బంగళాకు మారిన లాలూ..

By Kiran.G Aug. 06, 2020, 07:55 am IST
రిమ్స్ ఆస్పత్రి నుండి రిమ్స్‌ డైరక్టర్ బంగళాకు మారిన లాలూ..

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్‌ను రిమ్స్ హాస్పిటల్ నుండి రిమ్స్‌ డైరక్టర్ బంగళాకు తరలించారు.

పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆయన దోషిగా రుజువు కావడంతో ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్షను 2018లో సీబీఐ కోర్టు విధించిన విషయం తెలిసిందే. అప్పటినుండి జైలు జీవితం గడుపుతున్న లాలుప్రసాద్ యాదవ్ జైల్లో అనారోగ్యం పాలవడంతో రాంచీ నగరంలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా ఈ రిమ్స్ హాస్పిటల్ ను కరోనా హాస్పిటల్ గా మార్చడంతో లాలూ ప్రసాద్ యాదవ్ ను రిమ్స్ హాస్పిటల్ నుండి రిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ బంగళాలోకి మార్చాలంటూ జైలు అధికారులకు లేఖ రాశారు. దానికి జైలు అధికారులు ఒప్పుకోవడంతో లాలూ ప్రసాద్ యాదవ్‌ను రిమ్స్ హాస్పిటల్ నుండి రిమ్స్ డైరెక్టర్ బంగళాకు తరలించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp