మొన్న హరీష్.. నేడు కేటీఆర్..

దుబ్బాక ఎన్నికల ఫలితాల తరువాత మరోసారి టిఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ చెంప పెట్టుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎంతో ధీమాతో టిఆర్ఎస్ ఒంటరిగా బరిలో కి దిగింది. అయితే టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు ఈ రెండు పార్టీలు పోటాపోటీగా నిలిచాయి. టిఆర్ఎస్ 56 డివిజన్లలో విజయం సాధించగా, అనూహ్యంగా బీజేపీ దాదాపు 48 చోట్ల విజయం సాధించడం విశేషం. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లుగా వ్యవహరించిన డివిజన్ల లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా గ్రేటర్ ఎన్నికలను భుజం వేసుకున్న కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోయారు. కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా ప్రజల నమ్మకాన్ని గెలవలేకపోయారు. మొత్తానికి కేసీఆర్ కుటుంబానికి గ్రేటర్ ఎన్నికలు ఒక గుణపాఠం కానున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఇంచార్జి గా ఉన్న గాంధీ నగర్ లో.మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జి గా ఉన్న అడిక్ మెట్ లో టీఆరెస్ ఓటమి పాలు కావడం గమనార్హం. మంత్రి సబితా ఇంచార్జి గా ఉన్న ఆర్కే పురంలో కూడా టిఆర్ఎస్ ఓడిపోయింది. హబ్సి గూడలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య ఓటమి చెందారు. మక్తల్ ఎమ్మెల్యేరామ్మోహన్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న రామ్ నగర్ లో టీఆరెస్ అభ్యర్థి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తలసాని ఇంచార్జ్ గా ఉన్న ముషీరాబాద్ లో ని 3 చోట్ల, మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న సరూర్ నగర్ లో టీఆరెస్ ఓటమి పాలైంది. ఈ ఫలితాల ద్వారా రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని ఏ దిశగా నడిపించాలన్నది కేసీఆర్ కు అవుతుందని చెప్పవచ్చు.


Click Here and join us to get our latest updates through WhatsApp