కేజ్రీవాల్ నామినేషన్ మిస్

By Nehru.T Jan. 20, 2020, 09:36 pm IST
కేజ్రీవాల్ నామినేషన్ మిస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తఢిల్లీ శాసనసభా స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సోమవారం కుటుంబంతో కలిసి వాల్మీకి ఆలయాన్ని దర్శించుకున్న కేజ్రీవాల్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. వారితోబాటు రిటర్నిింగ్ ఆఫీసర్ కార్యాలయానికి సాయంత్రం 3 గంటలలోపు చేరుకోవాల్సి ఉంది.ఆలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ ర్యాలీలో చిక్కుకుని ఆ సమయంలోగా ఆర్వో కార్యాలయానికి చేరుకోలేకపోయారు. దీంతో ఆయన ఇంటికి వెనుదిరగాల్సి వచ్చింది.

ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా రేపటి లోగా (జనవరి 21) నామినేషన్లు సమర్పించాలి. తాను రేపు వచ్చి నామినేషన్ వేస్తానని ఆయన వెల్లడించారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp