హ్యాట్రిక్ విజయం సాధించిన కేజ్రీ వాల్

By Kiran.G Feb. 11, 2020, 02:14 pm IST
హ్యాట్రిక్ విజయం సాధించిన కేజ్రీ వాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో న్యూ ఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీ వాల్ మూడవసారి విజయం సాధించారు. భారీ విజయంతో ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా AAP పార్టీ ఎన్నికల ఫలితాలలో ముందుకు దూసుకు పోతుంది..

ఇప్పటికే 25 స్థానాల్లో విజయం సాధించిన AAP మరో 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. న్యూఢిల్లీ నియోజక వర్గం నుండి 13,508 ఓట్ల తేడాతో హ్యాట్రిక్ విజయం సాధించారు. భాజపా పార్టీ రెండు స్థానాలు కైవసం చేసుకుని మరో పది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఎగ్జిట్ పోల్స్ కి అనుకూలంగా ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడటం గమనార్హం..

దీంతో AAP కార్యాలయం వద్ద AAP కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెనుకంజలో ఉండటం AAP ని కొంచెం ఇబ్బంది పెట్టే విషయం.. దాదాపుగా AAP పార్టీ విజయం సాధించడం ఖరారు కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంతోషంలో మునిగిపోయారు. దీంతో హ్యాట్రిక్ సీఎం గా కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కనున్నారు ..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp