ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

By Kiran.G Oct. 29, 2020, 04:45 pm IST
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కవిత ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో ఆమె చేత ప్రమాణం చేయించారు.

ఈ నెల 9 న జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 824 ఓట్లకు గానూ, 823 ఓట్లు పోలు కాగా కవితకు 728 ఓట్లు దక్కడం విశేషం. దాదాపుగా 80 శాతం ఓట్లను సాధించిన ఆమె ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు. కవిత ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా క‌విత‌కు మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్ష‌లు తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp