కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి హవా

By Kotireddy Palukuri Dec. 09, 2019, 10:18 am IST
కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి హవా

కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార బిజెపి హవా కొనసాగుతోంది. 17 స్థానాలకు గాను 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. బిజెపి 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2, జేడీఎస్ కు 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు 17 మంది బీజేపీలో చేరడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత బిజెపి అధికారం చేపట్టింది. 105 సీట్లు ఉన్న బిజెపికి ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉంది. 17 మంది ఎమ్మెల్యే ల పై అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఐతే ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలుండటంతో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

అసెంబ్లీలో మిగిలిన 222కు గాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే యెడ్యూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. తాజా ఫలితాల సరళి బిజెపి కి అనుకూలంగా ఉండడం తో యడ్డి సర్కారుకి ఇబ్బందిలేదనే చెప్పుకోవచ్చు. మధ్యాహన్నం లోపు ఫలితాలు పూర్తిగా వెల్లడి కానున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp