కారెం శివాజీ కూడా

By Siva Racharla Nov. 29, 2019, 09:23 am IST
కారెం శివాజీ కూడా

అధికారపార్టీకి మైకులు అనే తరహా నాయకులు కొందరుంటారు. వీరి బాధ్యతలు, పార్టీ అధికారప్రతినిధుల బాధ్యతలకన్నా భిన్నంగా ఉంటుంది. విపక్షం మీద తమ మాటలతో విరుచుకుడటం, వాళ్ళు ప్రతి విమర్శ చేస్తే భావోద్వేగ ప్రతిసమాధానం చెప్పటం వీళ్ళనైజం.

మనం పార్టీ ఎప్పుడు మారాంరా?మనది ఎప్పుడు అధికార పార్టీనే! ఆపార్టీలు అధికారం కోల్పోతే మనమేమి చేస్తాం?వాళ్ళు మళ్ళీ గెలిచివుంటే మనం అదే పార్టీలో కొనసాగే వాళ్ళం... ఈధోరణిలో ఉంటుంది వీళ్ళ రాజకీయం...
పీవీ రావ్ అని మాలమహానాడు నాయకుడు ఉండేవారు. ఉద్యోగ సంఘాలలో మంచి పట్టు ఉన్న నేత. 1995-1996లో కృష్ణ మాదిగ MRPSను ఏర్పాటు చేసి SC లను A ,B ,C,D కేటగిరీలుగా విభంచాలని ఉద్యమం చెప్పట్టాడు. SC విభజనకు వ్యతిరేకంగా పీవీ రావ్ ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. కృష్ణ మాదిగకు చంద్రబాబు మద్దతు ఉండేది. కాంగ్రెస్ బహిరంగంగా SC విభజనను వ్యతిరేకించకపోయినా పీవీ రావుకు మద్దతు ఇచ్చేది.

Also Read :అమరావతి-మూడు ముక్కలు- సమస్యకు మూలాలు

1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పీవీ రావుకు తూర్పు గోదావరి జిల్లా అల్లవరం(2009 విభజనలో రద్దు అయ్యింది) ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి అయినా పీవీ రావు రాజీనామాను చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించటంలో ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చెయ్యటంతో పీవీ రావ్ ఆ ఎన్నికల్లో పోటీచేయలేక పోయాడు.కాంగ్రెస్ తరుపున అధికారిక అభ్యర్థి లేకపోవటంతో A.J.V.బుచ్చి మహేశ్వర రావ్ అనే స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇచ్చింది. కానీ ఆయన ఓడిపోయాడు. పీవీ రావ్ 2005లో గుండెపోటుతో మరణించాడు.

పీవీ రావ్ వారసులుగా జూపూడి ప్రభాకర్, కారెం శివాజీ రాజకీయ తెరమీదికి వచ్చారు. జూపూడికి ఉద్యోగసంఘాల మద్దతు దక్కగా, శివాజీకి గోదావరి జిల్లాలలో వారి మద్దతు దక్కింది. వైఎస్సార్ అశీస్సులతో జూపూడి రాజకీయంగా ఎదిగిపోయాడు. 2009 ఎన్నికల్లో పీవీ రావ్ శ్రీమతి ప్రమీల ప్రజారాజ్యం తరపున అమలాపురం లోక్ సభకు పోటీచేయగా జూపూడి,శివాజీ ఇద్దరు కాంగ్రెస్ హర్ష కుమార్ కు మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ప్రమీల రెండవ స్థానం లో నిలిచి,కాంగ్రెస్ అభ్యర్థి హర్ష కుమార్ మీద 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Also Read:రాంగోపాల్‌వ‌ర్మ‌కి పిచ్చి పాల్‌కి పిచ్చిన్న‌ర‌

వైసీపీ ఏర్పాటు తరువాత జూపూడి వైసీపీలో కీలకనేతగ ఎదిగారు.2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీచేయాలని ప్రయత్నం చేసినా జగన్ ఆయన్ను సొంత నియోజకవర్గం ప్రకాశం జిలా కొండపి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన జూపూడి తరువాత టీడీపీలో చేరి జగన్ను, వైసీపీ ని విమర్శించటమే అజెండాగా పెట్టుకున్నారు. జూపూడి సేవలకు చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆశించాడు కానీ SC కార్పొరేషన్ తో సరిపెట్టాడు.

2019 ఎన్నికల్లో జూపూడి వైసీపీ లో చేరగా ఇప్పుడు కారెం శివాజీ కూడా వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. వైసీపీ ని జగన్ను లక్ష్మణరేఖ దాటి తిట్టిన నాయకులెందరో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వైసీపీలో చేరగా... కారెం శివాజీ చేరటానికి అడ్డంకులు ఉండకపోవచ్చు....

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp