ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కపిల్‌దేవ్..

By Kiran.G Oct. 25, 2020, 06:21 pm IST
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కపిల్‌దేవ్..

ఛాతినొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన కపిల్‌దేవ్ క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వైద్యులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కపిల్‌దేవ్ తనకు యాంజియోప్లాస్టీ చేసిన వైద్యుడు అతుల్ మాథుర్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈరోజు ఉదయం కపిల్‌దేవ్ ను ఫోర్టిస్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసారని చేతన్ శర్మ వెల్లడించారు.

గురువారం అర్ధరాత్రి కపిల్‌దేవ్‌ ఛాతినొప్పి కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకి యాంజీయోప్లాస్టీ చికిత్స అందించి ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని మరో రెండురోజుల్లో ఆసుపత్రి నుండి కపిల్‌దేవ్‌ను డిశ్చార్జ్ చేస్తామని చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. వైద్యులు ప్రకటించిన ప్రకారమే రెండురోజుల్లో కపిల్ ను డిశ్చార్జ్ చేయడం గమనార్హం.

తమ అభిమాన క్రీడాకారుడు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.1983 క్రికెట్ ప్రపంచం కప్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు కపిల్ దేవ్ సారథ్యంలో మొట్టమొదటిసారిగా వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆయన సారథ్యంలోనే భారత క్రికెట్ జట్టు మేటి జట్టుగా అవతరించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp