బాబుపై దాడిని స‌మ‌ర్థిస్తూ క‌న్నా స్వీట్ ట్వీట్‌

By Sodum Ramana Nov. 29, 2019, 10:45 am IST
బాబుపై దాడిని స‌మ‌ర్థిస్తూ క‌న్నా స్వీట్ ట్వీట్‌

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఇటీవ‌ల కాలంటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాడు. రాష్ర్టంలో చోటు చేసుకునే ప్ర‌తి రాజ‌కీయ ప‌రిణామంపై ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఒక నెల‌లో ప‌ద‌వీ కాలం ముగుస్తున్న త‌రుణంలో ఆయ‌న యాక్టివ్ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకొంది.
రాజ‌ధాని ప్రాంతంలో గురువారం ప‌ర్య‌టించిన చంద్ర‌బాబుపై కొంద‌రు చెప్పులు, రాళ్ల‌దాడి చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై వివిధ రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు స్పందిస్తున్నాయి. బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంది.

Read Also: కారెం శివాజీ కూడా

"చేసుకున్న వాడికి చేసుకున్నంత మ‌హ‌దేవ‌...నాడు రాష్ర్టాభివృద్ధికి, రాజ‌ధానికి నిధులు ఇచ్చి ప్ర‌ధాని మోడీ గారు రాష్ర్టానికి వ‌స్తే...న‌ల్ల బెలూన్ల‌తో స్వాగ‌తం ప‌లికి దుష్ట‌బుద్ధి చూపావు. నేడు నువ్వు గ్రాఫిక్స్‌లో త‌యారు చేసిన అమ‌రావ‌తిలో పెయిడ్ ఆర్టిస్టుల‌తో వెళ్లిన నీకు చెప్పుల‌తో స్వాగ‌తం ల‌భించింది" అని ట్వీట్ చేశాడు.

చంద్ర‌బాబుపై చెప్పులు, రాళ్ల‌తో దాడి చేయ‌డాన్ని బీజేపీ స‌మ‌ర్థిస్తున్న‌ట్టుగా ఉండడం టీడీపీ నేతల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. అయితే గ‌తంలో తిరుమ‌ల‌కు వెళ్లి వ‌స్తున్న బీజేపీ చీఫ్ అమిత్‌షాపై తిరుప‌తిలో టీడీపీ శ్రేణుల దాడి, ఎన్నిక‌ల ప్ర‌చారానికి గుంటూరుకు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ రాక‌ను నిర‌సిస్తూ టీడీపీ శ్రేణులు న‌ల్ల బెలూన్ల‌తో నిర‌స‌న తెల‌ప‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. అప్ప‌ట్లో టీడీపీపై బీజేపీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. ఇప్పుడు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై రాజ‌ధానిలో వినూత్న‌నిర‌స‌న తెలిపిన నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు కూడా గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు.

Read Also: బాబుపై దాడి... క‌డ‌ప గూండాల ప‌ని కాదు క‌దా?

నెల్లూరు జిల్లా కావ‌లిలో క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌పై కూడా టీడీపీ శ్రేణులు దాడికి పాల్ప‌డ్డాయి. అప్ప‌ట్లో టీడీపీ శ్రేణులు రాష్ర్టానికి అన్యాయం చేసిన బీజేపీ నేత‌కు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని అభివ‌ర్ణించాయి. ఈ మాట‌లు ముల్లులా గుచ్చుకుంటూ మాన‌సిక బాధ అనుభ‌విస్తున్న క‌న్నా ...ఇప్పుడు బాబుపై దాడిని "చేసుకున్న వాడికి చేసుకున్నంత మ‌హ‌దేవ" అని ట్వీట్ చేశాడని అర్థం చేసుకోవాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp