సి.యం జగన్ పధకాలని కొనియాడిన - నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాశ్‌ సత్యార్థి

By Surya.K.R Jan. 22, 2020, 08:32 am IST
సి.యం జగన్ పధకాలని కొనియాడిన  - నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాశ్‌ సత్యార్థి

నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాశ్‌ సత్యార్థి సీఎం జగన్‌ను అసెంబ్లీ వద్ద కలిసి పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం బయటికి వచ్చిన కైలాశ్‌ సత్యార్థి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అవటం ఆనందంగా ఉందని తెలిపారు . ప్రభుత్వ పాఠశాలలో విధ్యార్ధుల కొరకు ఏర్పాటు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి , కల్పిస్తున్న వసతుల గురించి చర్చించామని, పాఠశాల విద్యలో జగన్‌ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ మోడల్‌ స్టేట్‌గా నిలుస్తుందని కొనియాడారు.

Read Also: సీఎం కు రాజధాని రైతుల కృతజ్ఞతలు

అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్రైన్ చైల్డ్ గా రూపొందించిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ బాగుందని. పిల్లలను బడులకు పంపే విధంగా రూపొందించిన అమ్మ ఒడి పథకం పేద తల్లులకు చేయూతగా నిలుస్తుందని ఇటువంటి పథకాలతో అక్షరాస్యత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఆద్వర్యంలో ఆంద్రప్రదేశ్ చేపడుతున్న కార్యక్రమాల వలన చిన్నారులకు కుల, మత, వర్గ, సాంఘిక భేదం లేకుండా విద్య అందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఖచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశమున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చైల్డ్‌ ఫ్రంట్‌ స్టేట్‌ అన్న ఆయన, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ సంస్థ తరఫున అన్నిరకాల సహాయ, సహాకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp