వ్యాఖ్యలతో విమర్శలు - చేతలతో ప్రశంసలు దక్కించుకున్న జ్యోతిక

By Kiran.G Aug. 08, 2020, 05:18 pm IST
వ్యాఖ్యలతో విమర్శలు - చేతలతో ప్రశంసలు దక్కించుకున్న జ్యోతిక

కరోనా దేశంలో విజృంభిస్తున్న వేళ తమిళ సినీ నటి జ్యోతిక తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి విరాళం ప్రకటించి మన్ననలు పొందుతున్నారు.

గతంలో ఒక అవార్డు ఫంక్షన్ లో జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆలయాల నిర్వహణకు పెట్టే ఖర్చు..,ఆలయాలకు హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని హాస్పిటల్స్ లో పూర్తి స్థాయి వసతులు కల్పించడానికి వినియోగిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.. దాంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.అనేకమంది అర్చకులు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది.

తాజాగా జ్యోతిక తంజావూర్‌లోని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం ఆమె 25లక్షలను విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రికి జ్యోతిక చేసిన సాయంపై ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జ్యోతిక సాయాన్ని అనేకమంది ప్రశంసిస్తున్నారు. కాగా ఒకప్పుడు తన వ్యాఖ్యలతో విమర్శల పాలైన జ్యోతిక తన చేతలతో ప్రశంసలు దక్కించుకోవడం విశేషం...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp