ఆంధ్రజ్యోతి కధనాలపై జస్టిస్‌ ఈశ్వరయ్య ఖండన

By Krishna Babu Aug. 09, 2020, 07:51 pm IST
ఆంధ్రజ్యోతి కధనాలపై జస్టిస్‌ ఈశ్వరయ్య ఖండన

బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న తనపై పనికట్టుకుని ఒక పార్టీకి వత్తాసు పలికే ఆంద్రజ్యోతి చానల్ తప్పడు కధనాలు ప్రసారం చేసిందని జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా టాంపరింగ్ వార్తలు ప్రచారం చేయడం కుట్రపూరితం అని ఆయన అభిప్రాయ పడ్డారు. బలహీన వర్గాలకు చెందిన వారు జడ్జీలుగా ఎందుకు పనికిరారో చెప్పాలని గతంలో చంద్రబాబును ప్రశ్నించిన కారణంగా ఆ చానల్ ఇప్పుడు దురుద్దేశ పూరితంగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు.

జడ్జి రామకృష్ణతో జరిపిన సంభాషణలు గురించి చెబుతూ తాను ఒక వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తికి జరిగిన అన్యాయం అనే కోణంలోనే మాట్లాడానని కానీ నా వాఖ్యలను ఎడిట్ చేసి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం ఆ చానల్ ఒక రాజకీయ పార్టీ ప్రోద్భలంతోనే దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తాను ఎప్పుడు న్యాయ వ్యవస్థ పై గౌరవంతోనే ఉన్నానని, ఒక పార్టీకి కొమ్ముకాస్తు దురుద్దేశంతో తన పై చేస్తున్న కుట్రలని మానుకోవాలని జస్టిస్‌ ఈశ్వరయ్య హితవు పలికారు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp