పవన్ ఆదేశిస్తే తలలు నరుకుతా...

By Siva Racharla Dec. 05, 2019, 05:59 pm IST
పవన్ ఆదేశిస్తే తలలు నరుకుతా...

పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ప్రజలను ఏవిధంగా ఉత్తేజపరిచిందో కానీ జనసేన నాయకులను బాగా రెచ్చకొడుతుంది. తాట తీస్తా ,తోలు తీస్తా లాంటి డైలాగులతో ఊగిపోయే పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా, రాప్తాడుకు చెందిన సాకే పవన్ కుమార్ (కొన్ని ఛానళ్లలో చూపించినట్లు ఇతని పేరు మురళి కాదు ) అనే నాయకుడు పవన్ ఆదేశిస్తే ప్రకాశ్ రెడ్డి అయినా ఏ రెడ్డి అయినా తలా నరుకుతాం,మేము రెడీ మీరు రెడీనా అంటూ మదనపల్లిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలో అన్నాడు.

సాకే పవన్ కుమార్ తలలు నరుకుతాం అంటూ ఊగిపోతున్నప్పుడు పవన్ చూస్తూ మిన్నకుండి పోయాడు,ఆ నాయకుడిని అదుపు చేసే ప్రయత్నం సభా వేదిక మీద ఉన్న నాయకులు ఎవరు చెయ్యలేదు. పవన్ రాయలసీమ సంస్కృతి, పులివెందుల పంచాయితీ ,ఫాక్షన్ అంటూ గత మూడు రోజులుగా పదే పదే చేసిన ప్రసంగాలు ఈ సాకే పవన్ కుమార్ ని ఉత్తేజపరిచినట్లు ఉంది. రాయలసీమలో పవన్ ప్రసంగాల ఇప్పటికే వివాదాస్పదం అవ్వగా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తలలు నరుకుతాం అనే స్థాయికి వెళ్లాయి. నిన్నటి వరకు మతం,కులం మీద పవన్ వాఖ్యలు చెయ్యగా నేడు జనసేన నాయకుడు సాకే పవన్ కుమార్ ఏకంగా రెడ్ల తలలు నరుకుతాం అనటం కులాల మధ్య ఘర్షణలకు జనసేన ఆజ్యం పోస్తుందా?.

Read Also: మేము ఉల్లిపాయ తినం--అయితే అవకాడో తింటారా?

2009లో రాప్తాడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి రాప్తాడులో పరిటాల - తోపుదారి ప్రకాశ్ రెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడుస్తుంది. ఎన్నికలప్పుడు ఘర్షణలు తప్ప వీరి మధ్య ఫ్యాక్షన్ లేదు. హంద్రీ-నీవా నీరు,అభివృద్ధి నినాదంతో గత ఎన్నికల్లో తోపుదర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ మీద గెలిచి,పరిటాల కుటుంబానికి ఓటమి రుచిని చూపించారు. ఎన్నికల తరువాత కూడా పరిటాల-తోపుదర్తి కుటుంబాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగలేదు.

రాప్తాడు నియోజకవర్గంలో జనసేన ఉనికి కూడా లేదు. మొన్నటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగ పోటీచేసిన ఈ సాకే పవన్ కుమార్ కు కేవలం 1624 ఓట్లు అంటే 1% కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. పవన్ కుమార్ లాంటి నాయకులను పవన్ అదుపుచెయ్యకపోతే తీవ్రనష్టం జరుగుతుంది.కుంటిమద్ది గ్రామానికి చెందిన పవన్ కుమార్ కుటుంబం మొదటలో పరిటాల వర్గంలో ఉండేది. ఆ గ్రామంలో చాలా సంవత్సరాల పాటు ఫ్యాక్షన్ నడిచింది కానీ పవన్ కుటుంబం మీద ఎలాంటి కేసులు లేవు,ఆరోపణలు కూడా లేవు.

Read Also: కడపే ఒక గ్రంథాలయం పవన్ కళ్యాణ్

ఫ్యాక్షన్ ను దగ్గరగా చూసిన పవన్ కుమార్ ఇప్పుడు తలలు నరుకుతాం లాంటి వివాదాస్పద వాఖ్యలు పవన్ ముందు గుర్తింపు కోసమే చేసుడనుకున్నా,రెచ్చగొట్టే ధోరణి ,కులాల మధ్య ఘర్షణలకు తావు ఇచ్చే సవాళ్లు హర్షణీయం కాదు. ఇలాంటివాటిని పార్టీ నాయకులు అదుపుచెయ్యటం మంచిది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp