Janasena, Nadendla Manohar -మనోహర్‌ చౌకబారు విమర్శలు

By Aditya Dec. 06, 2021, 11:00 am IST
Janasena, Nadendla Manohar -మనోహర్‌ చౌకబారు విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో జమీందారుల పాలన సాగుతోందని, వలంటీరు వ్యవస్థతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలతో పాలన నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరు మాగ్జిమమ్‌ కరప్షన్‌..మీనిమం సీఎంగా ఉందని వ్యాఖ్యానించారు. సభలో ఆవేశంగా ప్రసంగించిన మనోహర్‌ తాను రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను అసలు జనం నమ్ముతారనే అనుకున్నారా? కేవలం కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి అలా మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది.

 
ఎవరిది జమీందారి పద్ధతి..

రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పరిపాలిస్తుంటే జమీందారుల పాలన సాగడం ఏమిటో అర్థంకాదు. ప్రభుత్వ పనితీరులో ఆయనకు ఎక్కడ, ఏ అంశంలో జమీందారీ పోకడలు కనిపించాయో వివరించి ఉంటే బావుండేది. జనం మొత్తాన్ని జమీందారులను చేద్దామనే సంకల్పంతో సంక్షేమ యజ్ఞం నిర్వహిస్తున్న తమ ప్రభుత్వంపై ఈ విధంగా నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. ముందుచూపుతో చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలు సంతోషిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఈర్ష్యతో రోజూ వింత ఆరోపణలు చేస్తున్నాయని, మనోహర్‌ వ్యాఖ్యలు కూడా ఆ కోవలోకే వస్తాయని వారు కొట్టిపారేస్తున్నారు. అసలు జమీందారి సంస్కృతి జనసేన పార్టీలోనే ఉందని, పార్టీ అధ్యక్షుడు పవన్‌కు తీరిక దొరికినప్పుడో, మూడ్‌ వచ్చినప్పుడో జనంలోకి వచ్చి స్టేట్‌మెంట్‌లు ఇచ్చి వెళ్లిపోతుంటారు. పవన్‌కల్యాణ్‌ అలా జమీందారులా ఉంటే మనోహర్‌ ఆయన వద్ద దివాన్జీలా పనిచేస్తున్నారు అని, వారికి తమను విమర్శించే అర్హత లేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

Also Read : TRS - న‌మ‌స్తే తెలంగాణ ఎండీకి రాజ్య‌స‌భ సీటు?

వలంటీర్లను చూసి జనం ఎందుకు భయపడతారు?

వలంటీరు వ్యవస్థతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటున్న మనోహర్‌ విమర్శ మరీ చోద్యంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక అయిన ఈ వలంటీరు వ్యవస్థ ప్రజల అభిమానం చూరగొంది. ఒకటో తేదీన ఇంటి వద్దకు వచ్చి ఠంచనుగా పింఛను అందజేస్తున్న వలంటీర్లను చూసి లబ్ధిదారులు భయపడుతున్నారా? ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల సమాచారం జనానికి చేరవేస్తూ, అర్హులు వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నందుకు జనం బెంబేలెత్తుతున్నారా? నాకు ఫలానా పథకం లబ్ధి అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే... లోపం ఎక్కడుందో సవరించి, అధికారులతో మాట్లాడి ఆ పథకం ఫలం లబ్ధిదారునికి అందే వరకు శ్రమిస్తున్నందుకు వలంటీర్లను చూసి జనం భయపడుతున్నారా? ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతను ఉత్సాహంతో నిర్వహిస్తూ తన పరిధిలోని 50 ఇళ్ల లబ్ధిదారులతో కుటుంబ సభ్యులుగా మారిన వలంటీర్లను చూసి ఎవరు, ఎందుకు భయపడతారు? నిజానికి ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో వారి ముంగిటకే వెళ్లి సేవలు అందిస్తున్న వలంటీర్లను జనం గౌరవిస్తున్నారు.

వారి సేవలు వెలకట్టలేనివి..

గత తెలుగుదేశం పార్టీ పాలనలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాలకు పల్లెల్లో జనం భయపడేవారు. వారు లంచాలు తీసుకుంటే గాని ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరనిచ్చేవారు కాదు. ఆ సంస్కృతిని రూపుమాపడానికే సీఎం జగన్‌ ఈ వలంటీరు వ్యవస్థను తీసుకొచ్చి వారికి నెలకు రూ.5 వేల పారితోషికం ఇస్తూ వారి సేవలు వినియోగించుకొనే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో వలంటీర్లు చేసిన సేవలు విలువ కట్టలేనివి. క్వారంటైన్‌లో ఉన్న రోగుల వద్దకు వెళ్లి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం, మెడికల్‌ కిట్లను అందించడమే కాక పలు విధాలుగా ఆ కుటుంబాలకు సేవలు చేశారు. కరోనాతో మరణించిన వారి అంతిమ సంస్కారానికి అయినవాళ్లు, బంధువులు ముందుకు రాకపోతే ప్రాణభయాన్ని కూడా లెక్క చేయకుండా పలుచోట్ల వలంటీర్లు అంత్య క్రియలు జరిపి తమ సంస్కారాన్ని చాటుకున్నారు. వలంటీరు వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను మెచ్చుకుంది కూడా. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని అనుకుంటున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే మనోహర్‌ పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడమే వింత.

Also Read : Capital, Somu Veerraju బీజేపీ అధికారంలోకి రాగానే రాజధాని కట్టేస్తారట!

ఆధారాల్లేకుండా అవినీతి అనడం సమంజసమేనా?

రాష్ట్రంలో అవినీతి, అక్రమాలతో పాలన సాగుతోందని విమర్శించిన మనోహర్‌ అందుకు కూడా ఒక ఆధారంగాని, ఉదాహరణ గాని చెప్పలేదు. రాజకీయ పార్టీ నేత అన్నాక ఆ మాత్రం విమర్శించకపోతే బావుండదనుకున్నారో ఏమో? మాగ్జిమమ్‌ కరప్షన్‌ అని వ్యాఖ్యానించేశారు. అవినీతికి అవకాశం ఉండకూడదనే సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ విధంగా ఈ రెండున్నరేళ్లలో సుమారు రూ.లక్షా 30 వేలకోట్ల సొమ్ము లబ్ధిదారులకు అందింది. ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును ఎవరూ వేలెత్తి చూపకుండా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని ఆరోపిస్తున్నప్పుడు అందుకు ఆధారాలు చూపడం కనీస ధర్మం కదా. అది పాటించకుండా గాలిపోగేసి, చౌకబారు విమర్శలు చేస్తే ఎవరు నమ్ముతారు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp