పవన్‌ సొంతూరులోనూ ఓడిపోయిన జనసేన

By Prasad Sep. 26, 2021, 02:00 pm IST
పవన్‌ సొంతూరులోనూ ఓడిపోయిన జనసేన

‘‘మొగల్తూరు’’ మెగా బ్రదర్స్‌కు సొంత గ్రామం... మండల కేంద్రం కూడా. ‘‘నరసాపురం’’ సొంత అసెంబ్లీ నియోజకవర్గం... అలాగే పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రం కూడా. ఇక ‘‘పశ్చిమ గోదావరి’’ సొంత జిల్లా. ఇవన్నీ కూడా రాజకీయంగా మెగా బ్రదర్స్‌కు కొరుకుడుపడడం లేదు. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడైనా... నేడు పవన్‌ కళ్యాణ్‌ జనసేనతో జనం ముందుకు వచ్చినా ప్రజా ఆదరణ పొందలేకపోతున్నారు.

చిరంజీవి... పవన్‌ కళ్యాణలు ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవలేకపోయారు. మరో మెగాబ్రదర్‌ నాగేంద్రబాబు ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. సాధారణ ఎన్నికల్లోనే కాకుండా తరువాత జరిగిన మున్సిపల్‌.. తాజాగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో సైతం మొగల్తూరు..నర్సాపురం.. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.

Also Read : కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?

చిరంజీవి 2004లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి అత్యధిక అసెంబ్లీ స్థానాలు వస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కాని ఆ ఎన్నికల్లో సొంత జిల్లా పశ్చిమాన పీఆర్పీ చతికలపడిరది. పీఆర్పీకి కేవలం తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కింది. పాలకొల్లు నుంచి పోటీ చేసిన చిరంజీవి ఓటమి పాలవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇక సొంత నియోజకవర్గం నర్సాపురం నుంచి పార్టీ తరఫున పోటీ చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం ఓటమి పాలయ్యారు.

జనసేన ఆవిర్భావం తరువాత 2019 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలవలేదు. భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై ఓడిపోయారు. ఇదే ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసిన పవన్‌ సోదరుడు నాగేంద్రబాబు సైతం ఓటమి చవిచూశారు. నాగేంద్రబాబు మరీ దారుణంగా మూడవస్థానంలో నిలిచాడు. ఈ ఓటమి జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో నర్సాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం జనసేన ఓడిపోవడం మరింత నిరుత్సాహానికి గురిచేసింది.

Also Read : వయసైపోతోంది నాయకా..! 

తాజాగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో జనసేన మరింత పరాజయాన్ని మూటగట్టుకుంది. నర్సాపురం అసెంబ్లీ స్థానం పరిధిలో 36 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా, జనసేన కేవలం ఆరు మాత్రమే పరిమితమైంది. సొంత మండలం మొగల్తూరులో వైఎస్సార్‌సీపీ 18 ఎంపీటీసీలు గెలుచుకోగా, జనసేన కేవలం రెండుస్థానాలు, మిత్రపక్షమైన బీజేపీ ఒకస్థానం సరిపెట్టుకున్నాయి. మొగల్తూరు జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన గుండా జయప్రకాష్‌ నాయకుడు 3,360 ఓట్లతో గెలవడం గమనార్హం. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ పోటీ చేసి ఓటమి చెందిన భీమవరం అసెంబ్లీ స్థానం పరిధిలో భీమవరం మండలంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 18 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 17 ఎంపీటీసీలలో ఆ పార్టీ 13 చోట్ల గెలుచుకోగా, జనసేన మూడు స్థానాలకు పరిమితమైంది.

ఇక్కడ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిన కాండ్రేగుల నర్శింహరావు ఏకంగా 12,380 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే ఇదే నియోజకవర్గ పరిధిలో వీరవాసరం మండలం, జెడ్పీటీసీ స్థానాలు జనసేన దిక్కుంచుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. మొత్తం మీద సొంత మండలం, నియోజకవర్గం, జిల్లాలో అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌లు ప్రజాదరణ పొందలేకపోవడం అభిమానులకు మింగుడుపడని అంశంగా మారింది. పీఆర్పీతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ తరువాత సొంతంగా పార్టీ పెట్టినా సొంత జిల్లాలో పట్టు సాధించడం అటుంచి కనీసం నామమాత్రపు ఉనికిని కూడా చాటుకోకపోవడంపై పార్టీ శ్రేణులు నీరుగారిపోతున్నారు.

Also Read : చంద్రబాబు వాకిట్లో పవనన్న పార్టీ, పశ్చిమలో ప్రస్ఫుటమైన తీరు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp