నేడు భీమవరానికి జగన్

By Sridhar Reddy Challa Feb. 13, 2020, 11:11 am IST
నేడు భీమవరానికి జగన్

నిన్ననే ప్రధానితో భేటీఅనంతరం గతరాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి నేరుగా అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం భీమవరంలో జరగనున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు మనవడు వివాహవేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసునుండి బయలుదేరి హెలికాఫ్టర్ ద్వారా నేరుగా 4:25 గంటలకు భీమవరంలోని వి.యస్.యస్ గార్డెన్ కి చేరుకుంటారు.

వి.యస్.యస్ గార్డెన్ లో మాజీ మంత్రి మనవడి వివాహవేడుకల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:10 కి తిరిగి అక్కడనుండి బయలుదేరి నేరుగా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తో పాటు ఉన్నతాధికారులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp