శభాష్ జగన్ - దివాకరరెడ్డి

By Kiran.G Dec. 11, 2019, 03:15 pm IST
శభాష్ జగన్  - దివాకరరెడ్డి

రాంగోపాల్‌ వర్మకు సినిమా పేరు పెట్టడం తెలియదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసలు ఆ సినిమాకి "కమ్మ రాజ్యంలో రెడ్డి రాజ్యం" అని కాకుండా, "రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం" అని పేరు పెట్టాల్సిందని వ్యాఖ్యానించారు. ఈరోజు మీడియాతో జేసీ దివాకర్ రెడ్డి సరదాగా మాట్లాడుతూ జగన్ సర్కారుపై ప్రశంసలు కురిపించారు. జగన్ మోహన్ రెడ్డి ఆరునెలల పరిపాలన బాగుందని, జగన్ అనుకున్నది ధైర్యంగా చేయగలుగుతున్నాడని,జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ వల్ల అనేకమంది పేదలకు ఉపయోగకరంగా ఉందని, ఆరోగ్యశ్రీ విషయంలో జగన్ కి హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు.

జగన్‌ గట్స్‌ను మెచ్చుకుంటున్నానని, అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని విమర్శించారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజక్టులపై జగన్ బాగా మాట్లాడారని జేసీ దివాకర్ రెడ్డి మెచ్చుకున్నారు. జగన్ ఆశయం బాగానే ఉన్నా ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. జగన్ ని పొగిడిన విషయాంలో చంద్రబాబు ఏమనుకున్నా పర్వాలేదని దివాకర్ రెడ్డి స్పష్టం చేసారు. నెల్లూరులో మాఫియా ఉందని ఆనం రామనారాయణ రెడ్డి అనకుండా ఉండాల్సిందని మాఫియా ఎక్కడ లేదో చెప్పమని ప్రశ్నించారు.

జేసీ దివాకర్ రెడ్డి జగన్ ని ప్రెస్ మీట్లో ప్రశంసించడాన్ని చూసి టీడీపీ నేతలు ఎలా ప్రతిస్పందిస్తారో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp