అవినీతిపై పేలుతున్న జ‌"గ‌న్" తూటా

By Kalyan.S Oct. 25, 2020, 05:30 pm IST
అవినీతిపై పేలుతున్న జ‌"గ‌న్" తూటా

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదు. అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందే" అని సీఎం గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచీ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. వేసే ప్ర‌తి అడుగూ ఆ దిశ‌గానే వేస్తున్నారు. గ్రామ‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థల ప్రారంభంతో మున్సిప‌ల్, రెవెన్యూ శాఖ‌ల్లో అవినీతికి అడ్డుక‌ట్ట ప‌డింది. స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుతో మ‌ద్యం, ఇసుక వ్య‌వ‌స్థ‌ల్లో లంచాల‌కు చెక్ ప‌డింది. అవినీతి లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌న క‌ల అని చెప్పిన జ‌గ‌న్ క‌ల నెర‌వేరేలా ఫలితాలు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా ఏపీలో అవినీతి ఛాయ‌లు అంత‌గా వ్యాపించ‌డం లేదు. జ‌గ‌న్ ఆదేశాలు, చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు బాగానే ప‌నిచేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి.

త‌ర‌త‌రాల అవినీతిదారులు మూసివేత‌

మున్సిప‌ల్, రెవెన్యూ కార్యాల‌యాల్లో జ‌రిగే అవినీతి తంతుపై క‌థ‌లు, క‌థ‌లుగా వింటూనే ఉన్నాం. కొంత మంది లంచ‌గొండుల వ‌ల్ల ఎంతో మంది నిజాయితీ అధికారులు కూడా ఇబ్బందులు ప‌డేవారు. ప్ర‌జ‌లకు అత్య‌ధికంగా అవ‌స‌ర‌ముండే స‌ర్టిఫికెట్లు, రేష‌న్ కార్డులు, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు.. ఇలా ఏది అవ‌స‌ర‌మైనా కార్యాల‌యంలోని ఎవ‌రో ఒక‌రికి లంచం ముట్ట‌చెప్పితే కానీ ప‌ని త్వ‌ర‌గా అయ్యేది కాదు. ఇది ఒక‌టి, రెండు కాదు.. ప‌దుల సంవ‌త్స‌రాలుగా ఈ తంతు కొన‌సాగింది. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక స‌రికొత్త పాల‌న‌కు నాంది ప‌లికిన విష‌యం తెలిసిందే. గ్రామ‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటుతో ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చే వ్య‌క్తులు ఇంటి ముంగిట‌కే వ‌స్తున్నారు. దీంతో రేష‌న్ కార్డులు, కుల ధ్ర‌వీక‌ర‌ణ ప‌త్రాలు.. ఇలా ప్ర‌తీ అవ‌స‌రానికి కార్యాల‌యాల మెట్లు ఎక్కే ప‌రిస్థితి త‌గ్గింది. ప‌నుల కోసం ప్ర‌జ‌లు లంచం ఇచ్చుకోవాల్సిన అవ‌స‌ర‌మూ పోయింది. వ‌లంటీర్లు ఎక్క‌డైనా లంచం అడిగార‌న్న‌, తీసుకున్నార‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతో అవినీతికి పాల్ప‌డాలంటే భయపడే ప‌రిస్థితి వ‌చ్చింది.

ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ కు స్పంద‌న‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదులకు ప్ర‌త్యేక కాల్ సెంటర్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ ప్రారంభించారు. ఎవరైనా లంచం అడిగితే 14400కి కాల్ చేయొచ్చని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా ఈ కాల్ సెంట‌ర్ లో స్వీక‌రిస్తున్నారు. ఎవ‌రిపైనైనా ఫిర్యాదు వ‌చ్చిందంటే చాలు.. వెంట‌నే చ‌ర్య‌ల‌కు ఉన్న‌తాధికారులు ఉప‌క్ర‌మిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదుల‌నైనా 15 రోజుల లోపు ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే 1902కు వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్‌ చేసే వ్యవస్థను బ‌లోపేతం చేశారు. దీనికి కలెక్టర్‌ కార్యాలయాలను కూడా అనుసంధానం చేశారు. టౌన్‌ ప్లానింగ్, సబ్‌ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ‌ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకుండా ప‌క‌డ్బందీ వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ రూపొందించారు. ఏపీలో అవలంబిస్తున్న ఈ విధానాల‌న్నీ జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఏపీపై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp