వైఎస్సార్ తర్వాత మళ్లీ జగన్ హయంలోనే..

By Raju VS Jun. 29, 2020, 08:25 pm IST
వైఎస్సార్ తర్వాత మళ్లీ జగన్ హయంలోనే..

వైఎస్సార్ పాలనలో అమలు చేసిన రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తానని ఎన్నికలకు ముందు జగన్ పదే పదే చెప్పేవారు. అంతేగాకుండా సీఎంగా తొలినాడే ఆయన తన తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తానని ప్రకటించారు. దానికి అనుగుణంగానే వివిధ పథకాల్లో తన తండ్రి పాలనను తలపించేలా సాగుతున్నారని సామాన్యుల్లో అభిప్రాయం కలిగిస్తున్నారు. అదే క్రమంలో కీలక పథకాలకు పునరుత్తేజం కల్పిస్తున్నారు. ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి హయంలో పురుడు పోసుకుని, వాటిని చూడగానే వైఎస్సార్ గుర్తుకొస్తారనే పేరున్న వాటికి పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే తాజాగా 108,104 వాహనాలను సిద్ధం చేశారు. రాష్ట్రమంతా మళ్లీ కుయ్..కుయ్ మనే శబ్దాలు వినిపించేందుకు సన్నద్దం చేశారు. జూన్ 1 నాడు వాటిని రోడ్డెక్కించే పనిలో పడ్డారు. సీఎం చేతుల మీదుగా వాటిని ప్రారంభించేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.

విజయవాడలో నిర్వహించబోయే కార్యక్రమంలో వాటిని సీఎం ప్రారంభిస్తారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. మొత్తం రూ.203.47 కోట్ల తో కొనుగోలు చేసిన వాహనాలు మళ్లీ రోడ్ల మీద హల్ చల్ చేయబోతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో 108,104 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈసారి వాహనాల్లో వెంటిలేటర్,ఇన్ ఫుజాన్ పంప్స్,సిరంజి పంప్స్ కూడా ఉంటాయని అదికారులు ప్రకటించారు. అంతేగాకుండా చిన్నారుల కోసం ప్రత్యేకంగా 26 నియోనేటల్ అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొస్తుండడం విశేషం. దేశంలోనే ఇలాంటి ప్రయత్నం తొలిసారిగా జరుగుతోందని అంటున్నారు.

ఈ వాహనాలలో మండలనికి ఒకటి చొప్పున 104 వాహనం అందుబాటులో ఉంచుతారు. మండల వ్యాప్తంగా సంచార వైద్యశాలగా వాటిని వినియోగిస్తున్నారు. వైఎస్సార్ హయంలో ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత రానురాను వాటి ప్రాభవం పడిపోయింది. ఇప్పుడు వాటిని మళ్లీ పట్టాలెక్కించే పనిలో జగన్ ప్రభుత్వం ఉంది. అంతేగాకుండా అత్యవసరం వేళ అందుబాటులోకి తెచ్చి, అనేక మంది ప్రాణాలు నిలిపిన 108 వాహనాలు ఇటీవల తీవ్ర సమస్యలతో ఉన్నాయి. చాలామందికి సకాలంలో వైద్యం అందకపోవడానికి, 108 స్పందించకపోవడమే కారణమనే వాదనలున్నాయి. దాంతో వాటిని ప్రజలకు త్వరితగతిన సేవలందించేందుకు గానూ 412 వాహనాలు సిద్ధం చేశారు. అత్యవసర క్రిటికల్ సమయాల్లో అడ్వాన్సుడు లైఫ్ సపోర్టు వాహనాలు మరో 104 ఉంటాయి.. లైఫ్ సపోర్టు బేసిక్ వాహనాలు 282 ఉంటాయి. 104 వాహనాలు మొత్తం 676 అందుబాటులో ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రమాదం జరిగిన 20నిమిషాల్లోనే వాహనం ఘటనా స్థలానికి చేరేలా తీర్చిదిద్దుతున్నారు. పట్టణ ప్రాంతంలో అది15 నిమిషాల్లో చేరాల్సి ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా 25 నిమిషాల్లోనే సంఘటనా ప్రాతానికి చేరుకునేలా వాహనాలు అందుబాటులో ఉంచారు.

వైఎస్సార్ తర్వాత ముగ్గరు ముఖ్యమంత్రులు మారినప్పటికీ రానురాను ఈ వాహనాల పరిస్థితి కునారిల్లిపోయింది. యాజమాన్యాలు మారినప్పటికీ వాహనాల మరమ్మత్తులు, సదుపాయాల కొరత, సిబ్బంది ఇబ్బందులు అన్నీ కలిసి 108 వాహనాలు పూర్తి స్థాయి లక్ష్యాలకు దూరంగా మిగిలిపోయేవి. ఈ తరుణంలో ఇప్పుడు జగన్ చేసిన ప్రయత్నంతో మళ్లీ ప్రజల ప్రాణాలు కాపాడే వాహనాలుగా రూపుదిద్దుకోవడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp