జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Krishna Babu Aug. 04, 2020, 06:57 pm IST
జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాధాలను నివారించేందుకు ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ విష వాయువులు కలిగి ఉన్న పరిశ్రమలు, ప్రమాదకరమైన రసాయనాలు, పేలుడు పధార్ధాలు, రెడ్ క్యాటగిరి పరిశ్రమలను గుర్తించి, వాటి అన్నిటిని తనిఖీ చేసి ఆయా పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేయాల్సింది గా అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల్లో భద్రతా విషయమై ముఖ్యమంత్రి ఆదేశానుసారం జాయింట్ కలక్టర్ చైర్మన్ గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలో ఉన్న సంభందిత పరిశ్రమల్లో లోపాలను గుర్తించేందుకు ప్రత్యక డ్రైవ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ కమిటి నిర్ణీత సమయంలో డ్రైవ్ నిర్వహించి పరిశ్రమల్లో సిబ్బంది మాస్కులు కలిగి ఉన్నారా, అగ్నిమాపక యంత్రాలు, ఫోమ్‌, నీటితో నియంత్రణ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయా , అలాగే ఏమైనా ఇతరేతర భద్రతా పరమైన లోపాలు ఉంటే గుర్తించి 30 రోజుల్లోనే వాటిని సరిదిద్దే విధంగా అలాగే ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లో పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp