జగన్ నిర్ణయం - కాపుల్లో హర్షాతిరేకాలు

By Kotireddy Palukuri Dec. 13, 2019, 08:46 am IST
జగన్ నిర్ణయం - కాపుల్లో హర్షాతిరేకాలు

ఆంద్రప్రదేశ్ లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాపు సామజిక వర్గ ప్రజలు, నేతల మోముల్లో సంతోషాలను నింపింది. 2014 ఎన్నికల సమయంలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనీ కాపులు ఉద్యమ బాట పట్టిన విషం తెలిసిందే. ఐతే ఇచ్చిన మాట నిలబోట్టుకోకుండా కాపు ఉద్యమంపై చంద్రబాబు ఉక్కు పాదం మోపారు. ఉద్యమ నాయకులపై ఎడా పెడా కేసులు పెట్టారు. జైలుకు పంపారు. కోర్టులు చుట్టూ తిప్పారు. ఇప్పటికి వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

తాను అధికారంలోకి వస్తే కాసులు ఎత్తివేస్తానని సీఎం జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ.. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కాపు ఉద్యమంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుని ఘటన మినహా అన్ని కేసులను ఎత్తి వేయడంతో కాపు సామజిక వర్గ నేతలు, ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp