ఇప్పుడేమంటారు బాబూ.. సర్కారీ మటన్ దుకాణాలు మీకు నచ్చినట్టేనా

By Raju VS Sep. 24, 2021, 11:15 am IST
ఇప్పుడేమంటారు బాబూ.. సర్కారీ మటన్ దుకాణాలు మీకు నచ్చినట్టేనా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ప్రతిపాదించిన మటన్ దుకాణాల నిర్వహణ విషయంపై విపక్షం మండిపడింది. తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. మందు, మటన్ అమ్మడమే ప్రభుత్వ పనా అని కూడా ప్రశ్నించింది. చివరకు ప్రభుత్వం దాని మీద స్పష్టత ఇచ్చింది. కేవలం ప్రతిపాదనలే తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పింది.

అక్కడితో కథ ముగిసిపోలేదు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం మరింత దూకుడుగా వెళుతోంది. ఏపీ మాదిరిగా ఉపాధి పెంచడం, నాణ్యమైన మటన్ మార్టులు నిర్వహించడం కాకుండా, ఇప్పటికే ఉన్న మటన్ దుకాణాలన్నీ ప్రభుత్వ పరం చేసే యోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని పశుసంవర్ధక శాఖ యోచిస్తున్నట్లు టీఆర్ఎస్ కి చెందిన పత్రికల్లోనే కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా చేయబోతున్న మార్పులను ఆ వార్తలో ప్రస్తావించారు.

ప్రభుత్వ మటన్ దుకాణాల్లో భాగంగానే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కబేళాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతిజోన్‌ పరిధిలో ఒక కబేళా, జిల్లాల్లో ఒకటి లేదా రెండు ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ఆయా కబేళాలను స్థానికంగా ఉండే మటన్‌ దుకాణాలకు లింక్‌ చేయబోతున్నట్టు తెలిపింది. అక్కడి నుంచే మాంసం సరఫరా చేస్తారని వివరించింది. దుకాణదారులు ప్రభుత్వం అందించిన మాంసాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని వివరించింది.

Also Read : జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?

దీనిద్వారా వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యపరంగా మేలుజేసే మాంసం అందించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేసత్ఉన్నారు. వాటితో పాటుగా మాంసం దుకాణాల్లో శుభ్రత పాటించేలా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది. దుకాణాల ఆధునికీకరణకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు వివరించింది.ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 వేలదాకా మటన్‌ షాపులు ఉండగా.. రెండువేల దుకాణాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని భావించడం ఆసక్తిగా మారింది.

ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న జీహెచ్ఎంసీ పరిధిలోనే ఆయనకు మటన్ కావాలన్నా ప్రభుత్వ దుకాణం నుంచే తీసుకురావాల్సి ఉంటుంది. ఇకపై ఆయన కూడా సర్కారీ మటన్ వ్యాపారుల వద్దే కొనక తప్పదు. మరే అదే బాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం ఏపీ ప్రభుత్వం చేస్తే తప్పుబడుతుండడం విశేషం. తెలంగాణాలో ఒప్పు అయినది ఏపీలో తప్పు ఎలా అవుతుందో టీడీపీ నేతలకే తెలియాలి. ఒకవేళ తెలంగాణాలో కూడా తప్పు అయితే అక్కడ కూడా కేసీఆర్ సర్కారుని జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎందుకు నిలదీయడం లేదో చేప్పాలి. అలా కాకుండా రెండుకళ్ల సిద్ధాంతం అంటూ ఒక కంట్లో అన్నం, రెండో కంట్లో సున్నం అన్నట్టుగా వ్యవహరించడం టీడీపీకి మాత్రమే తెలిసిన విద్య అని మాటన్ మార్టుల సాక్షిగా మారోసారి నిరూపితం అవుతోంది.

Also Read : నేటి నుంచే అసెంబ్లీ : రాజ‌కీయ దుమారం ఖాయం!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp