బీజేపీతో పొత్తుపై ప‌వ‌న్ పున‌రాలోచ‌న‌లో ఉన్నారా..?

By Kalyan.S May. 08, 2021, 09:45 am IST
బీజేపీతో పొత్తుపై ప‌వ‌న్ పున‌రాలోచ‌న‌లో ఉన్నారా..?

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన‌ప్ప‌టి నుంచీ బీజేపీ - జ‌న‌సేన పొత్తు వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌గా మారింది. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ఫలితంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయఢంకా మోగించారు. రాజకీయాలకు కొత్తే అయినా, పోటీలో తొలిసారి నిలబడినా, అత్యంత కీలకమైన స్థానంలో పోటీ చేసినా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ‌తో ఘ‌న విజయం దక్కించుకు న్నారు. ఇక్క‌డ వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని ఎన్నిక‌ల‌కు ముందే తెలిసినా, మెజార్టీపైనే చ‌ర్చ జ‌రిగేది.

అయితే, బీజేపీకి ఈ సారి జనసేన జ‌త క‌ట్ట‌డంతో ఓట్లు చీలిపోయి వైసీపీకి అనుకున్నంత మెజార్టీ రాద‌ని అంద‌రూ భావించారు. పైగా ఆ కూట‌మి నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను రంగంలోకి దించారు. దీంతో గెల‌వ‌క‌పోయినా, వైసీపీ మెజార్టీపై బీజేపీ - జ‌న‌సేన కూట‌మి ప్ర‌భావం చూపుతుంద‌నుకుంటే, ఘోరంగా ఫెయిలైంది. ఆ పార్టీపై మెజార్టీపై ప్ర‌భావం చూప‌డం అటుంచి, బీజేపీ డిపాజిట్ కూడా పొంద‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో బీజేపీ - జ‌న‌సేన పొత్తు ఎంత వర‌కూ, ఎవ‌రి లాభ ప‌డింద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.
తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2 లక్షల 71 వేల 391 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి గెలిచిన విష‌యం తెలిసిందే. చారు. ఆ ఎన్నిక‌ల్లో సుమారు 11 ల‌క్ష‌ల ఓట్లు పోల‌వ్వ‌గా గురుమూర్తికి ఏకంగా 6 లక్షల 25 వేల 820 ఓట్లు ప‌డ్డాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 354253 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు కేవ‌లం 57 వేల 070 ఓట్లు వచ్చాయి. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి గురుమూర్తి ఆధిక్యంలోనే కొనసాగారు.

అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి భారీ మెజార్టీతో పనబా కపై గురుమూర్తి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 722877 టీడీపీకి 494501 ఓట్లు వచ్చాయి. ఈసారి పోలింగ్ శాతం త‌గ్గ‌డంతో మెజార్టీ కూడా త‌గ్గింది. కానీ, త‌గ్గిన పోలింగ్ శాతంతో పోల్చ‌కుంటే వైసీపీ గ‌తం కంటే ఎక్కువ ఓట్ల‌నే సాధిచింది.
ఇదే ఎన్నికల్లో 2019లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బొమ్మి శ్రీహరిరావు.. కేవలం 16125 ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు రత్న ప్రభ 57070 ఓట్లు దక్కించుకున్నారు. అయినప్పటికీ.. డిపాజిట్ కోల్పోయారు.

అయితే.. ఈ మాత్రం ఓట్లయినా.. జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రచారంతోనే ఇక్కడ బీజేపీకి పడ్డాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు.. పవన్.. ఇక బీజేపీతో ఏమేరకు కొనసాగుతారు? తన పొత్తునుఎలా కొనసాగిస్తారు? అనేది ఆసక్తిగా ఉంది. ఆయన వల్ల బీజేపీకి ప్రయోజనం ఉందని. బీజేపీ వల్ల పవన్కు ఎలాంటి ప్రయోజనం లేదనే విషయం తాజా ఎన్నికలలోనూ స్పష్టమైందని జ‌న‌సైనికులు కూడా మ‌రోసారి అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఏమాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీతో జట్టు క‌ట్ట‌డం వ‌ల్ల జ‌న‌సేన కూడా ప్రాభ‌వం కోల్పోవ‌డం త‌ప్పించి లాభం ఉండ‌దని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ పొత్తు కొన‌సాగిస్తారా, లేదంటే టీడీపీతో జ‌త‌క‌డ‌తారా, ఇక‌పై ఒంట‌రిగానే ప్ర‌యాణం సాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp